కరోనా సోకి ఐసీయూల్లో వైద్యం పొందుతున్న వారెవరికీ రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని ఎంపీ విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.అలాగే, ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన వెల్లడించారు.విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి కరో న భాదితులను పరామర్శించారు. విమ్స్ కోవిడ్ ఆసుపత్రి దగ్గర పరిస్థితి ని విజయసాయి పరిశీలించారు. ఆసుపత్రిలో పీపీఈ కిట్ ధరించి కోవిడ్ బాధితుల యోగ క్షేమాలు తెలుసు కున్నారు. అంతకు ముందు కేజీహెచ్ లో సీఎస్ ఆర్ బ్లాక్ లో కోవిడ్ చికిత్స పొందుతున్న బాధితులకు పరామ ర్శించి చికిత్స పొందుతున్న వారికి అవసరమైన అన్ని రకాల చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. కరోనా గురించి ఎవరూ భయపడొద్దని ప్రభుత్వం అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉంటుంది అన్నారు. రోగులు,వారి బంధువులతో స్వయం గా మాట్లాడారు.అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. విమ్స్‌లో 460 పడకల సామర్థ్యానికి గాను, 445 మంది పేషెంట్లు ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారని చెప్పారు. కొత్త పేషెంట్లను చేర్చుకుంటున్నారని తెలిపారు. కేజీహెచ్‌లో కూడా ఇలాగే వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు.తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేస్తు న్నారని, వారి సేవలను కొనియాడారు.