YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు

భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు

వాషింగ్టన్‌ మే 1
భారత్‌లో కరోనా ఉధృతి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌట్‌ శుక్రవారం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సలహా మేరకు.. భారత్‌ నుంచి నుంచి ప్రయాణాలను పరిమితం చేయనున్నట్లు ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌సాకి పేర్కొన్నారు. అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు 14 రోజుల వ్యవధిలో భారత్‌లో ప్రయాణించిన అమెరికాయేతర పౌరుల ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు.భారత్‌లో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బహుళ వేరియంట్లతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ (సీడీసీ) నిర్ధారించింది. బీ.1.617 వైరస్‌ వేరియంట్‌ భారత్‌లో కేసుల పెరుగుదలకు కారణమని సీడీసీ భావిస్తోంది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రజారోగ్యాన్ని సంరక్షించేందుకు చురుకైన చర్యలు అవసరమని సీడీసీ తేల్చినట్లు ప్రెస్‌ సెక్రెటరీ పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డుదారులు, వారి భార్యలు, 21 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. 

Related Posts