YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను విడుదల చేసిన కేంద్రం

రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ మే 1
కేంద్ర ప్రభుత్వం శనివారం రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఆయా రాష్ట్రాలకు చేరే మొత్తంలో 50 శాతం నిధులను కరోనా నివారణ చర్యలకు వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ సారి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను కేంద్రం ముందుగానే విడుదల చేసింది. సాధారణంగా ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసు మేరకు జూన్‌లో కేంద్రం విడుదలవుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించిన మొత్తానికి సంబంధించిన వినియోగ ధ్రువీకరణపత్రం కోసం చూడకుండా.. 22 రాష్ట్రాలకు ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో 50శాతం అంటే రూ.4,436.8 కోట్లను కరోనా కట్టడికి రాష్ట్రాలు వినియోగించుకోవచ్చు. ఆసుపత్రుల్లో వెంటిలెటర్లు, ఎయిర్‌ ప్యూరీఫైయర్లు, అంబులెన్స్‌ సేవల బలోపేతం, కొవిడ్‌ ఆసుపత్రులు, కేర్‌ సెంటర్లలో ఆక్సిజన్‌ ఉత్పత్తి, నిల్వ ప్లాంట్ల ఖర్చులు తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చని ఆర్థికశాఖ పేర్కొంది.

Related Posts