YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటలపై వేటు తప్పదా

ఈటలపై వేటు తప్పదా

ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  భూ కబ్జా ఆరోపణల వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. శనివారం ఉదయం ఆగమేఘాలపై విచారణకు దిగిన రెవెన్యూ, విజిలెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రాథమిక నివేదికను సిద్ధం చేశాయి. మూడెకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందించనట్లుగా రూడీ అయినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ నిర్ధారించారు విజిలెన్స్ విభాగం అధినేత పూర్ణచంద్రరావు కుడా మాసాయిపేటకు వచ్చారు. . మాసాయిపేట తహసీల్దార్ ఆఫీస్లో మకాం వేసిన కలెక్టర్.. భూ రికార్డులను పరిశీలించారు. పలు పాత  రికార్డులను, డ్యాకుమెంట్లను క్షుణంగా తనిఖీ చేశారు. తరువాత ఈటల నిర్మాణం చేస్తున్న జమునా హాచరీస్లో మూడు ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే క్షేత్రస్థాయి సర్వే కూడా పూర్తి చేసి ఈరోజు మూడు గంటల వరకు నివేదికను సీఎస్కు సమర్పిస్తామని అన్నారు.. రెవెన్యూతో పాటుగా విజిలెన్స్ నివేదిక కూడా రాత్రి వరకు సీఎం కేసీఆర్కు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఈటల మంత్రి పదవికి రాజీనామా చేయవచ్చని వార్తలు వచ్చాయి.ఈటల మంత్రిత్వ శాఖను గవర్నర్ శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రికి బదిలి చేయడంతో ఈటలపై వేటు తప్పదని సమాచారం. ఇప్పటికే ఈటల వ్యవహారం రాష్ట్రాన్ని హీటెక్కిస్తోంది. బీసీ వర్గాల నుంచి ఈటలకు మద్దతు కూడా పెరుగుతోంది. పలు చోట్ల ఈటలకు మద్దతుగా అభిమానులు అందోళనకు దిగారు.

Related Posts