YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

రెండు వారాలు లాక్‌డౌన్ పెట్టండి..తాత్కాలిక హాస్పిట‌ల్స్‌ను కట్టండి ఇండియాకు సూచించిన వైట్‌హౌజ్ చీఫ్ మెడిక‌ల్ అడ్వైజ‌ర్ డాక్ట‌ర్ ఆంటోనీ ఫౌచీ

రెండు వారాలు లాక్‌డౌన్ పెట్టండి..తాత్కాలిక హాస్పిట‌ల్స్‌ను కట్టండి ఇండియాకు సూచించిన వైట్‌హౌజ్ చీఫ్ మెడిక‌ల్ అడ్వైజ‌ర్ డాక్ట‌ర్ ఆంటోనీ ఫౌచీ

వాషింగ్ట‌న్‌ మే 1
ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ క‌ట్ట‌డికి ముఖ్య‌మైన సూచ‌న‌లు చేశారు అమెరికా వైద్య నిపుణుడు, వైట్‌హౌజ్ చీఫ్ మెడిక‌ల్ అడ్వైజ‌ర్ డాక్ట‌ర్ ఆంటోనీ ఫౌచీ. ముందు దేశంలో క‌నీసం రెండు వారాలు లాక్‌డౌన్ పెట్టండి. ఆ త‌ర్వాత చైనాలోలాగా తాత్కాలిక హాస్పిట‌ల్స్‌ను నిర్మించండి. ఓ కేంద్ర వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయండి అని ఫౌచీ సూచించారు. సూచ‌న‌లే కాదు క‌రోనాపై గెలిచేశామంటూ భార‌త ప్ర‌భుత్వం చాలా ముందుగానే ప్ర‌క‌టించింద‌ని చుర‌క‌లంటించారు.ఇండియా చాలా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సాధ్య‌మైనంత ఎక్కువ కాలం దేశంలో లాక్‌డౌన్ విధించండి. ఇది చాలా ముఖ్యం. ఆ త‌ర్వాత అత్య‌వ‌స‌రాలైన ఆక్సిజ‌న్‌, ఇత‌ర మందులు, పీపీఈ కిట్లు సమ‌కూర్చుకోండి అని ఫౌచీ సూచించారు. దీనికి చైనా ఉదాహ‌ర‌ణ‌ను ఆయ‌న చెప్పారు. గ‌తేడాది అక్క‌డ ఇలాగే క‌రోనా విరుచుకుప‌డిన‌ప్పుడు దేశం మొత్తం లాక్‌డౌన్ విధించారు. వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను అడ్డుకోవ‌డానికి ఇది చాలా అవ‌స‌రం. త‌ర్వాత వ్యాక్సినేష‌న్ వేగం పెంచండి. అత్య‌వ‌స‌రాల‌న స‌మకూర్చుకోవ‌డంపై దృష్టి సారించండి. గ‌తంలో ఇండియా సాయం చేసింది కాబట్టి ఇప్పుడు అమెరికాతోపాటు చాలా దేశాలు సాయానికి ముందుకు వ‌చ్చాయి అని ఫౌచీ అన్నారు.ఇక రెండోది చైనాలాగే అత్యంత వేగంగా తాత్కాలిక హాస్పిట‌ల్స్‌ను ఇండియా నిర్మించాలి. ఈ విష‌యంలో చైనాను చూసి ప్ర‌పంచ‌మే ఆశ్చ‌ర్య‌పోయింది. ప్ర‌స్తుతం ఇండియాలో హాస్పిట‌ల్స్ చాలా అవ‌స‌రం. మిలిట‌రీ సాయం తీసుకోవ‌డంపైనా ప్ర‌భుత్వం దృష్టి సారించాలి. అమెరికాలో వ్యాక్సిన్ల పంపిణీకి నేష‌న‌ల్ గార్డ్ సాయం తీసుకున్నాం. ఇక హాస్పిట‌ల్స్‌ను యుద్ధం స‌మ‌యంలో ఎలా నిర్మిస్తారో అంత వేగంగా నిర్మించాలి. ఇక్క‌డ మ‌న శ‌త్రువు వైర‌స్ అని ఫౌచీ అన్నారు. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 2 శాతం మందికే వ్యాక్సిన్ ఇవ్వ‌డం చాలా తీవ్ర‌మైన అంశ‌మ‌ని, ఏం చేసైనా వ్యాక్సినేష‌న్ వేగం పెంచాల్సిందే అని ఫౌచీ స్ప‌ష్టం చేశారు.

Related Posts