YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చంపేందుకు కుట్ర :  పాల్

చంపేందుకు కుట్ర :  పాల్

చంపేందుకు కుట్ర :  పాల్
విశాఖపట్టణం, మే 1, 
గన్ ప్రభుత్వం తనను చంపేసేందుకు కుట్రలు చేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌తో కేఏ పాల్ చేపట్టిన దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో వచ్చిన కరోనా కేసులు.. ప్రపంచంలో మరెక్కడా రాలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో డేంజర్ పరిస్థితి నెలకొని ఉందని ఆందోళన వ్యక్తం చేశారుముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన సలహాలు తీసుకుని తమ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని కేఏ పాల్ విమర్శించారు. జగన్ రాష్ట్ర ప్రజల దృష్టిలో రాజకీయ శత్రువుగా మారుతున్నారని తెలిపారు. సోమవారం హైకోర్టు తీర్పు కచ్చితంగా పరీక్షలు వాయిదా చేయాలని వస్తుందని.. కాబట్టి, ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కారును కోరారు. ఒకవేళ పరీక్షలు వాయిదా వేస్తే తాను వెంటనే దీక్ష విరమిస్తానని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు కూడా పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారని కేఏ పాల్ తెలిపారు.ఇక, శుక్రవారం డూప్లికేట్, డాక్టర్లు, పోలీసులను పంపించి కేజీహెచ్‌లో తనను చంపడానికి ప్రయత్నించారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా వద్దకు డాక్టర్లను పంపించవద్దు.. నేను కేజీహెచ్‌కు వెళ్లను.. నన్ను చంపేసినా సరే, ఇక్కడే దీక్ష చేస్తా’’ అని కేఏ పాల్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం తనకు బీపీ, షుగర్ లెవెల్‌ బానే ఉన్నాయన్నారు. ‘‘నేను గతంలో ఎన్నోసార్లు ఉపవాస దీక్షలు చేశాను. నాకు గురించి ఏమీ భయపడక్కర్లేదు. నాకేం కాదు. కానీ, పరీక్షలు వాయిదా వేయండి.. నేనే మీ ఇంటికి వచ్చి కలుస్తాను’’ అని సీఎం జగన్‌కు కేఏ పాల్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్టడంలో విఫలమయ్యాయని కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Related Posts