గుంటూరు
గుంటూరు జిల్లా తెనాలిలో రెమెడిసివర్ ఇంజక్షన్ల అక్రమ దందాకు పోలీసులుచెక్ పెట్టారు. రెమెడిసివర్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసారు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వ్యక్తిద్వారా ఇంజక్షన్ల సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 6 రెమెడిసివర్ ఇంజక్షన్లు, రూ 2.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇంజక్ష్లు తెప్పింది అధిక ధరలకు అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఇంజక్షన్లు అమ్ముతున్న వారిని అరెస్టు చేసారు ఇంజెక్షన్లఅక్రమ దందా నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఎస్పీ విశాల్ గున్నీ ఏర్పాటు చేసారు. సామాన్యుల తరహాలో ముఠాను ఇంజక్షన్ కావాలని బృందంలోని అధికారులు కోరారు. నిందితులు వారికి ఇంజక్షన్ లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు.