YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సాగూతోన్న బెజవాడ ఫ్లైఓవర్ పనులు

 సాగూతోన్న బెజవాడ ఫ్లైఓవర్ పనులు

విజయవాడలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనులు..ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. సాక్షాత్‌ సీఎం చంద్రబాబు కాంట్రాక్టు సంస్థలకు క్లాస్‌ తీసుకున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫ్లై ఓవర్‌పై తలోమాట మాట్లాడుతుండడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. నిర్మాణ సంస్థల డెడ్‌లైన్లు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో పై వంతెన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏపీ రాజధాని ప్రాంతంలోని దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కనకదుర్గ గుడి ఫ్లై ఓవర్‌ పనులు ప్రారంభించి 28 నెలలు గడిచినా.. పనుల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు. ఈ పనులను దక్కించుకున్న సోమా కంపెనీ 2016 పుష్కరాలకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఏదీ ఏమైనా ఆగస్టు, సెప్టెంబర్‌ కల్లా దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనులు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ చెబుతున్నారు. బెజవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులకు, పాలకుల మధ్య సమన్వయలోపం ఉందన్న విమర్శలున్నాయి. దీంతో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనులు ఎప్పటికీ పూర్తవుతుందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. దుర్గగుడి ప్లై ఓవర్ పనులు నిర్లక్ష్యంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. సర్కార్ చెబుతున్న మాటలకు పొంతనలేకపోవడంతో దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తేవాలని బెజవాడవాసులు డిమాండ్ చేస్తున్నారు.వర్షాకాలానికి ముందుగానే కనకదుర్గా ఫ్లైవర్‌ నిర్మాణ పనులు పూర్తిచేయాలని స్టేట్‌ హైవేస్‌ అధికారులు, సోమా కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను, కృష్ణాజిల్లా కలెక్టర్‌  లక్ష్మీకాంతం ఆదేశించారు. ఆశించిన మేర పనులు వేగవంతంగా జరగకపోవటం పట్ల కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. పనుల జాప్యానికి సంబంధించి కాంట్రాక్టు సంస్థ కంపెనీ ప్రతినిథులను వివరణ కోరారు. నగర ట్రాఫిక్‌ అంతా ఎక్కువుగా జాతీయ రహదారిపై ఉన్నందున వర్షాకాలానికిముందుగానే ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రోజువారీ పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు అందచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పనులను తుది రూపుకు తీసుకు రావాలని ఆదేశించారు. 

Related Posts