YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బొక్క బొర్లా పడ్డ బీజేపీ

బొక్క బొర్లా పడ్డ బీజేపీ

తిరుపతి, మే 3, 
భారతీయ జనతా పార్టీ ఆశలు ఫలించలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు దానికి గట్టి షాక్ ఇచ్చారు. అసలు పోటీ లోకి కూడా పరిగణనలోకి తీసుకోనట్లే కన్పించింది. ఆర్భాటం తప్ప బీజేపీకి జనాల్లో విషయం లేదన్నది తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో స్పష్టమయింది. ఇంత దారుణ ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. కేంద్ర ప్రభుత్వం వైఖరి తిరుపతి ఉప ఎన్నిపై ప్రభావం చూపిందనే చెప్పాలి. జనసేనతో కలసి పోటీ చేయడంతో తాము ప్రభావం చూపగలమని భావించారు.తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఆచితూచి అన్నీ లెక్కలు వేసి మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభను నిర్ణయించారు. ఆమె ఎంపిక కరెక్టే. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ రత్న ప్రభ వ్యక్తిత్వం, ఆమె ఇమేజ్ కంటే బీజేపీ పై వ్యతిరేకత ఎక్కువగా పనిచేసిందనే చెప్పాలి. ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. హిందుత్వ నినాదాన్ని భుజాన వేసుకుని, తిరుపతి వైసీపీ అభ్యర్థి గురమూర్తి మతం, కులంపైనా, తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఎంత యాగీ చేసినా ప్రజలు ఆ వైపు చూడలేదనే చెప్పాలి.ఇక్కడ ఒక విషయం అర్థమయింది ఏమిటంటే జనసేన ఓట్లు కూడా బీజేపీకి పడలేదు. జనసేన క్యాడర్ మొత్తం టీడీపీకే ఓట్లు వేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా తనకున్న ప్రధానమైన ఓటు బ్యాంకును బీజేపీ వైపు మరల్చుకోలేకపోయారు. ప్రధానంగా బలిజ సామాజికవర్గం ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడలేదు. జనసేన అధినేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా అదే సామాజికవర్గమయినా వారు టీడీపీ వైపు చూశారని చెప్పాలి. అందుకే కనీస ఓట్లను కూడా సాధించలేకపోయింది.దీనికి కారణం తిరుపతి ఉప ఎన్నికలో తాము పోటీ చేయడానికి జనసేన అక్కడ ప్రయత్నించింది. కానీ తొలి నుంచి జనసేన పోటీకి బీజేపీ నేతలు అడ్డుతగిలారు. పవన్ కల్యాణ్ తో చర్చించక ముందే తామే పోటీ చేస్తామని ప్రకటించడం వంటివి జనసేన పార్టీ క్యాడర్ కు ఆగ్రహాన్ని తెప్పించాయంటున్నారు. అందుకే బీజేపీకి తిరుపతి ఉప ఎన్నికలో దారుణమైన ఓటమిని చూడాల్సి వస్తుంది. టీడీపీని దాటి సెకండ్ ప్లేస్ కు వస్తామని భావించిన ఆ నేతలు కాంగ్రెస్ ను మాత్రం వెనక్కు నెట్టగలిగారు. వైఎస్సార్‌సీపీ మెజార్టీ 2 లక్షల 25 వేలు దాటింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు  2,25,773 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు.
వైఎస్సార్‌సీపీ- 4,61,366(57 శాతంటీడీపీ- 2,55,271 (31.5 శాతం)బీజేపీ-43,317 (5.4 శాతం)కాంగ్రెస్- 7,233(0.9 శాతం)సీపీఎం- 4,232 (0.6 శాతం)ఇతరులు- 26,316 (3.3 శాతం)
నోటా-11,509 (1.4 శాతం)అంతే తప్ప తిరుపతిలో బీజేపీ సాధించిందేమీ లేదు?
బీజేపీపై సోషల్ మీడియాలో సెటైర్లు
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ దూసుకెళ్లింది.. భారీ మెజార్టీని దక్కించుకుంది. మొదటి రౌండ్ నుంచి గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగారు. టీడీపీకి రెండో స్థానంలో నిలిచింది.. బీజేపీకి మూడో స్థానంలో ఉంది. తిరుతిపై భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు పరాభవం తప్పలేదు. ఒక్క రౌండ్‌లో కూడా ఆ పార్టీకి ఆధిక్యం కనబడలేదు.. ఆమెకు నామమాత్రపు ఓట్లు మాత్రమే దక్కాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఈ ఫలితంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారనే చెప్పాలి. ఎలాగైనా సత్తా చూటాలనుకున్న బీజేపీకి నిరాశ తప్పలేదు.తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు, బీజేపీకి పరాభవంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కమల దళానికి ఈసారి కొంత ఊరట లభించిందని నెటిజన్లు, వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయంటున్నారు.. అది కూడా పవన్ కళ్యాణ్ పుణ్యమే అంటూ కొత్త లాజిక్ తెరపైకి తెస్తున్నారు. జనసేన పార్టీతో కలిసి పోటీ చేయకపోయుంటే ఆ మాత్రం కూడా ఓట్లు వచ్చేవి కాదంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల లాజిక్‌ను తెరపైకి తెస్తున్నారు.2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటాకు 25,781 ఓట్లు వస్తే.. బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావుకు 16,125 ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీకి 20,971 ఓట్లు వచ్చాయి. అందుకే ఈసారి బీజేపీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ పరోక్షంగా ట్వీట్‌లు చేస్తున్నారు. ఏపీ బీజేపీ కూడా తిరుపతిలో గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేసింది.. కానీ ఫలితం మాత్రం ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. అయితే బీజేపీ, టీడీపీలు మాత్రం అధికార పార్టీ అక్రమాలు చేసిందని ఆరోపిస్తున్నాయి. ఈ ఫలితాలపై జనసేన, బీజేపీలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి

Related Posts