YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్ తో అధికార పార్టీలో ఉత్సాహం

సాగర్ తో అధికార పార్టీలో ఉత్సాహం

నల్గొండ, మే 3, 
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం అధికార పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపినట్లయింది. దుబ్బాక ఓటమితో దెబ్బతిన్న టీఆర్ఎస్ కు ఈ విజయం బూస్ట్ నిచ్చిందనే చెప్పాలి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి, అనేక సర్వేలు జరిపన తర్వాత చివరకు నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ ను అభ్యర్థిగా నిర్ణయించారు.ఇక ఎన్నికల వ్యూహాన్ని కూడా కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతి మండాలనికి ఒక మంత్రిని ఇన్ ఛార్జిగా నియమించారు. ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేను పర్యవేక్షకుడిగా నియమించారు. ప్రతిరోజూ కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసి అప్రమత్తం చేయడంతోనే ఈ ఫలితం వచ్చిందంటారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు నోముల నరసింహయ్య మరణంతో సానుభూతి కూడా పనిచేసిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఇక్కడ సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉండటం, నోముల భగత్ యువకుడు కావడంతో మరింత జాగ్రత్తగా టీఆర్ఎస్ అధినాయకత్వం వ్యవహరించింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో సభ పెట్టి సాగర్ నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు. హుజూర్ నగర్ తరహాలోనే కేసీఆర్ ఈ ప్రసంగం చేశారు. దీంతో నోముల భగత్ కు విజయం దక్కినట్లు చెప్పవచ్చు.తొలి నుంచి నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే పోటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ నుంచి టిక్కెట్ దక్కని వారికి కూడా కేసీఆర్ కండువా కప్పేశారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ నాయకులంతా సమిష్టిగా పనిచేశారు. దుబ్బాక ఫలితం రిపీట్ కాకూడదనే అందరూ శక్తికి మించి పనిచేశారు. ఫలితంగా నోముల భగత్ విజయం సాధించారు.
పక్కా ప్లాన్

Related Posts