YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆ రెండు పదవులు డేంజరే

ఆ రెండు పదవులు డేంజరే

హైదరాబాద్, మే 3, 
తెలంగాణలో రెండు సెంటిమెంట్లు బలంగా కన్పిస్తున్నాయి. ఒకటి స్పీకర్ గా పనిచేసినవారు మరోసారి గెలిచే అవకాశం లేకపోవడం. రెండు వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన మంత్రి పదవి మధ్యలోనే ఊడిపోవడం. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం. అయితే ఇందుకు లక్ష్మారెడ్డిని మినహాయింపు నివ్వాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు పదవిలో ఉండరన్న సెంటిమెంట్ ఉండేది.రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో తొలుత వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాజయ్య పనిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో రాజయ్యను కేసీఆర్ బర్త్ రఫ్ చేశారు. ఆయన స్థానంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరిని తీసుకువచ్చి ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. ఇలా రాజయ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మధ్యలోనే పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.ఆతర్వాత వచ్చిన లక్ష్మారెడ్డి పూర్తి కాలం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో తిరిగి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన లక్ష్మారెడ్డికి కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కలేదు. తర్వాత వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను కేసీఆర్ నియమించారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండటం, ఈటల రాజేందర్ పై ఎటువంటి అవినీతి మచ్చలేదు.కానీ తాజాగా ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈయన పదవికి గండం పొంచి ఉంది. బర్త్ రఫ్ చేయడమా? లేక ఆయనే స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవడమో చేయాల్సి ఉంటుంది. ఇక 2014లో స్పీకర్ గా పనిచేసిన మధుసూధనాచారి 2018లో గెలవలేదు. ఈ సెంటిమెంట్ కూడా పనిచేస్తుందనే టాక్ తెలంగాణలో బాగా విన్పిస్తుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలతో వైద్య ఆరోగ్య శాఖ సయితం డేంజర్ అన్నది రాజకీయ నేతల్లో బలమైన సెంటిమెంట్ గా ఉంది.

Related Posts