YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆ ముగ్గురు కొత్తపార్టీ

ఆ ముగ్గురు కొత్తపార్టీ

హైదరాబాద్, మే 3, 
అవుతుందా లేదా అనేది వ‌దిలేద్దాం. అస‌లు ఎవ్వారం మొద‌లైందా లేదా అనేది వ‌దిలేద్దాం. టాక్ అయితే ఉంది. ఆ మ‌ధ్య మాజీ ఎంపీ కూడా ఇలాగే అన్నారు చూశాం క‌దా. పైగా ఆయ‌న ఏమ‌న్నారు.. టీఆర్ఎస్, కేసీఆర్ కి వ్య‌తిరేకంగా ఉండే వారంద‌రినీ ఏకం చేస్తా అన్నారు. మ‌రో వైపు చూస్తే.. ఈటెల రాజేంద‌ర్ సొంత పార్టీ పెడుతున్నార‌ని.. అప్ప‌టి నుంచే సీఎం కేసీఆర్ కి.. మినిస్ట‌ర్ ఈటెల రాజేంద‌ర్ కి ఫ్రెండ్షిప్ క‌ట్ అయింది అని వింటున్నాం.
ఇక పోతే.. హ‌రీశ్ రావుది కూడా సేమ్ సిచ్చువేష‌న్. ఎంత మామ పార్టీ అయినా.. ప‌ద‌వుల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఎప్ప‌టికీ బ‌య‌టి లీడ‌ర్ గా ఉండి పోవాల్సిందే అంటూ.. మేథావులు చెబుతున్నారు. ఆ విష‌యాన్ని హ‌రీశ్ ఎక్స్ పీరియ‌న్స్ చేస్తున్నారు కూడా చానాళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. క‌రోనా టైంలో.. యాక్చువ‌ల్ గా హ‌రీశ్ హ‌డావిడి వేరే ఉండాలి. కానీ.. కంటికి కూడా క‌నిపించ‌డం లేదు. అన్నీ తానై చూసుకునే లీడ‌ర్ కాస్తా.. కాస్త సైడ్ ఉంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.
ఎందుకంటే.. హ‌రీశ్ రావుకి ఈటెల రాజేంద‌ర్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్ద‌రికీ టీఆర్ఎస్ లో బ‌లం ఉంది. ఎవ‌రికి వారికి వ‌ర్గం లీడ‌ర్లు.. ఎమ్మెల్యేల బ‌లం బాగానే ఉంది. సో.. ఇద్ద‌రూ సైడ్ అయ్యారంటే.. టీఆర్ఎస్ లో స‌గం చీల‌డం ఖాయం. అటు బ‌ల‌ప‌డితే.. వేరే లీడ‌ర్లు కూడా తోడొస్తారు. ఎన్నిక‌ల టైంకి.. ఇంకాస్త పెరుగుతుంది బ‌లం. ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడూ హ‌రీశ్ రావు గురించి మంచిగానే మాట్లాడుతుంటారు. టీఆర్ఎస్ లో ఉంటే దెబ్బ తింట‌వ్ హ‌రీశ్ రావ్ అంటూ.. హెచ్చ‌రిక‌లు చేస్తుంటారు. ఇటు ఈటెల రాజేంద‌ర్ విష‌యంలో కూడా రేవంత్ అలాగే ఉంటారు.
రాజ‌కీయ ప‌ర‌మైన అభిప్రాయ భేదాలే త‌ప్ప‌.. వీరి ముగ్గురికీ ప‌ర్స‌న‌ల్ గా అంతా మంచిగానే ఉంటుంది దోస్తానా. సో.. అటు రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ లో పెద్ద‌గా ఉప‌యోగం లేదు అని తెలిసిందే. తెలంగాణ‌లోని ఈ ముగ్గురు మాస్ లీడ‌ర్లు కానీ.. చీలారంటే అతిపెద్ద పార్టీ కావ‌డం ఖాయం. అందులో ఎలాంటి  డౌటూ లేదు. సో.. క‌లుస్తారా లేదా అన్న లెక్క‌లు చాలానే ఉన్న‌య్. క‌లుస్తున్నారు.. అనే అంచ‌నాలు కూడా చాలానే ఉన్న‌య్. చూడాలి.. ఏ నిమిషానికి ఎలా మారుతుందో రాజ‌కీయం. ఇప్పుడు అనుకున్నామా.. రెండు మూడు రోజుల్లో ఈటెల పొలిటిక‌ల్ లైఫ్ ఇలా ట‌ర్న్ అవుతుంది అని. అయ్యింది క‌దా. ఇక మిగ‌తా పాలిటిక్స్ కూడా అంతే.

Related Posts