హైదరాబాద్
నగరంలోని మెహదీపట్నం ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద దారుణం జరిగింది. ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకోవడానికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమేష్ కుమార్పై ముగ్గురు ఆగంతకులు దాడి చేశారు. అతని వద్ద నుంచి డబ్బులు, పర్సు, రెండు బంగారు ఉంగరాలు, సెల్ఫోన్ను లాక్కొని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సమీపంలోని అమోధ్య నగర్ లో వుంటున్నాడు. ఎనిమిది నెలల క్రితమే అతడికి వివాహం అయింది. ఘటనపై స్పందిస్తూ ఆసిఫ్ నగర్ పోలీసులు సీఐ రవీందర్ రమేష్ కుమార్ పై దాడిజరిగినట్లు ఫిర్యాదు అందింది. చికిత్స పొందుతూ రమేష్ కుమార్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మృతుడు సతీమణి ఫిర్యాదు చేసింది. గతంలో మృతుడికి అనారోగ్య సమస్యలు వున్నాయి . మే 1 న రమేష్ మృతి చెందాడు. 302, 394. ఐ పి సి సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నము. వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. మృతుడు రమేష్ ఎక్కడెక్కడ వున్నాడు ఆ రోజు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.