YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ పద్మవ్యూహాంలో చిక్కుకున్న టీడీపీ

పవన్ పద్మవ్యూహాంలో చిక్కుకున్న టీడీపీ

టీడీపీని జ‌న‌సేనాని టార్గెట్ చేస్తున్నారా,... అంటే ఔననే సమాధానమే వస్తోంది. త‌న‌పై కుట్ర జ‌ర‌గుతోంద‌ని, త‌న పార్టీని అంతం చేయాల‌ని చూస్తు న్నార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. అందుకే తాను ఆచితూచి అడుగులు వేస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఆయ‌న ఈ సంద‌ర్భంగా చాలా ఉద్వేగంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ప‌రిణామాల‌ను పైకి చెప్ప‌క‌పోయినా.. తాను చేసిన టార్గెట్ అధికార ప‌క్ష‌మేన‌ని, అందుకే త‌న‌ను అంతం చేయాల‌ని కుట్ర చేస్తున్నార‌న్నారు న‌టి శ్రీరెడ్డి వ్య‌వ‌హారంతో ఒక్క‌సారిగా ప‌వ‌న్ వివాదాల్లో చిక్కుకుపోయారు. శ్రీరెడ్డి త‌న త‌ల్లిని తిడితే.. మీడియా ప‌దే ప‌దే చూపించిం ద‌ని, అదే చంద్ర‌బాబును ఇలాగే ఎవ‌రైనా తిడితే స‌ద‌రు ఛానెళ్లు ప‌దే ప‌దే ప్ర‌సారం చేస్తాయా? అని నిల‌దీశారు.మొత్తంగా ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది.ప్ర‌స్తుతం లీగ‌ల్ నోటీసుల వ‌ర‌కు వెళ్లింది. ఇక‌, ఇంత‌లో జ‌న‌సేనాని మ‌రో ప్ర‌క‌ట‌న రూపంలో విరుచుకుప‌డ్డారు. జనసేన ప్రజా కార్యక్రమాలపై దుష్టశక్తులు కన్నేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీపై ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి భయపడిన కొన్ని స్వార్థపూర్తిత శక్తుల దుష్ట పన్నాగాన్ని పోలీసు నిఘా వర్గాలు పసిగట్టాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ నెలలో చిత్తూరు, గుంటూరు జిల్లా బాపట్లలో చేపట్టే కార్యక్రమాల్లో తుని రైలు దుర్ఘటనలాంటి విధ్వంసక చర్యలకు పాల్పడి జనసేనను అపకీర్తి వచ్చేలా కుట్ర జరిగినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఇందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన కిరాయి మూకలను స్వార్థ శక్తులు సంప్రదిస్తున్నాయని చెప్పి మమ్మల్ని అప్రమత్తం చేశాయి. అందుకే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో చేపట్టాల్సిన పర్యటనలు వాయిదా వేశాం’ అని తెలిపారు.గుంటూరు జిల్లా స్టువర్టు పురం నివాసి వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారుడు వెంకటరాహుల్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించినందుకు ఈ నెల 30న స్టువర్టుపురంలో పాదయాత్ర, బాపట్లలో సన్మానం చేద్దామని నిర్ణయించామని వెల్లడిం చారు. అయితే.. ఇలాంటి కుట్రలకు తాను వెరువనన్నారు. జిల్లాల్లోని సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు వీలుగా సుదీర్ఘ పర్యటనలకు కార్యాచరణను సిద్ధం చేయాలని పార్టీ వర్గాలకు సూచించానని పేర్కొన్నారు. అయితే, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం పూర్తిగా టీడీపీనే టార్గెట్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏదోఒక వ్యూహంతో టీడీపీని అణ‌గ‌దొక్క‌డం ప‌వ‌న్ ప్ర‌ధాన అజెండాల్లో ఒక‌టిగా ఉంది. త్వ‌ర‌లోనే ఆయ‌న బస్సు కం పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాలు ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టంగా మారింద‌ని చెబుతున్నారు. మ‌రి ప‌వ‌న్ వ్యూహాలు టీడీపీని ఇబ్బంది పెడ‌తాయా ? లేదా ప‌వ‌న్ వ్యూహంలో టీడీపీ చిక్కుకుంటుందా ? అన్న‌ది చూడాలి.

Related Posts