YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైద్రాబాద్ లో మల్టీ లెవల్ పార్కింగ్

హైద్రాబాద్ లో మల్టీ లెవల్ పార్కింగ్

మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న అక్రమ పార్కింగ్‌కు చెక్ పెట్టడంతో పాటు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నగరంలో మల్టీలెవెల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించనున్నారు. మల్టీలెవెల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి వివిధ శాఖలు తమ అవసరాలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్దం చేసి, సర్కారుకు పంపాలని ఇప్పటికే ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశించారు. ఆయా శాఖకు చెందిన సంబంధించిన ఖాళీ స్థలాలను కూడా గుర్తించి, వివరాలను పంపాలని సూచించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎక్కువ అవసరాలున్న హైదరాబాద్ మెట్రోరైలు ఇతర శాఖలతో సమన్వయకర్తగా వ్యవహారించనున్నట్లు తెలిపారు. నగరంలో నిర్మించనున్న అన్ని మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను రాష్ట్ర పోలీసు శాఖ అమలు చేస్తున్న స్మార్ట్ పార్కింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద నిర్మించనున్నారు కాంప్లెక్స్‌లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) ప్రాతిపదికన అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తేనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు పంపే ప్రతిపాదనలు, ఖాళీ స్థలాలను తొలి దశగా నగరంలో 30 నుంచి 40 వరకు ఈ పార్కింగ్ కాంప్లెక్స్‌లను రెడీ కానున్నాయి.

Related Posts