YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క‌రోనా సెకండ్ వేవ్ ..దేశంలో 7.97 శాతానికి చేరిన నిరుద్యోగ రేటు

క‌రోనా సెకండ్ వేవ్ ..దేశంలో 7.97 శాతానికి చేరిన నిరుద్యోగ రేటు

న్యూఢిల్లీ మే 4
క‌రోనా సెకండ్ వేవ్ ఇండియా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పైనా పెను ప్ర‌భావమే చూపుతోంది. దేశంలో నిరుద్యోగ రేటు 7.97 శాతానికి చేరింది. మార్చిలో 6.5 శాతంగా ఉన్న ఈ రేటు ఒక్క నెల‌లోనే ఒక‌టిన్న‌ర శాతం మేర పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఒక్క ఏప్రిల్ నెల‌లోనే దేశ‌వ్యాప్తంగా మ‌రో 70 ల‌క్ష‌ల మంది త‌మ జీవ‌నోపాధిని కోల్పోయిన‌ట్లు సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ ప్రైవేట్ సంస్థ వెల్ల‌డించింది. రానున్న రోజుల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత మంద‌గించే అవ‌కాశం ఉంది. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి రాష్ట్రాలు లాక్‌డౌన్లు, క‌ర్ఫ్యూలు విధిస్తుండ‌టమే దీనికి కార‌ణం.లాక్‌డౌన్ల కారణంగానే ఉద్యోగాల సంఖ్య ప‌డిపోతున్న‌ద‌ని సీఎంఐఈ ఎండీ మ‌హేష్ వ్యాస్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికీ వైర‌స్ వ్యాప్తి ఇంకా ఉద్ధృతంగానే ఉన్న నేప‌థ్యంలో మే నెల‌లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా.. ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మై జీడీపీ వృద్ధి రేటు మైన‌స్‌లోకి పత‌న‌మైంది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్‌లో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాల‌న్న డిమాండ్లు వ‌స్తున్నా.. కేంద్రం దీనిపై పెద్ద‌గా స్పందించ‌డం లేదు. అయితే స్థానిక ప్ర‌భుత్వాలు మాత్రం ఎక్క‌డిక‌క్క‌డ ఆంక్ష‌లు విధిస్తున్నాయి.గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం మూడు, నాలుగు త్రైమాసికాల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ కుదుట‌ప‌డ‌టంతో ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధి రేటు రెండంకెల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నా వేశారు. అయితే సెకండ్ వేవ్ ఆంక్ష‌ల కార‌ణంగా ఇప్పుడు దానిపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే బార్‌క్లేస్ బ్యాంక్ పీఎల్‌సీ ఇండియా వృద్ధి రేటు అంచ‌నాను 11 నుంచి 10 శాతానికి త‌గ్గించింది.ఇక ఏప్రిల్ నెల‌లోనూ త‌యారీ రంగంలో ఉద్యోగాలు పోతున్న‌ట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ చేసిన మ‌రో సర్వేలో తేలింది. ముఖ్యంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అధికంగా ఉన్న‌ద‌ని, లాక్‌డౌన్ల కార‌ణంగా ఎంతో మంది కూలీలు తిరిగి గ్రామాల బాట ప‌డుతున్నార‌ని తెలిపింది. ఇక లేబ‌ర్ ఫోర్స్ పార్టిసిపేష‌న్ రేటు ఏప్రిల్ నెల‌లో 40 శాతం కంటే దిగువ‌కు వ‌చ్చింది

Related Posts