YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మేడమ్ టుస్సాడ్స్ లో నాని

మేడమ్ టుస్సాడ్స్ లో నాని

టూరిస్ట్ అట్రాక్షన్‌గా నిలిచే ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుస్సాడ్స్. అటువంటి ఘనతను తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు పొందనున్నారు. ఈ మ్యూజియంలో టాలీవుడ్ నుంచి తొలిసారి ఒక నటుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి మ్యూజియం ప్రతినిధులు మహేశ్ కొలతలు, వివరాలు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని నమ్రత, మహేశ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.లండన్‌లో ఏర్పాటైన ఈ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో తన శాఖలను విస్తరించింది. మన దేశంలో కూడా ఢిల్లీలో ఈ మ్యూజియం ఉంది. చరిత్రకారులు, ఫిల్మ్ స్టార్స్ లాంటి ప్రముఖుల విగ్రహాలను మైనంతో తయారు చేసి ప్రదర్శనకు ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహాలను చూడడానికి టూరిస్ట్‌లు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ మ్యూజియంలో మైనపు విగ్రహ ప్రదర్శన అంటే అది అరుదైన ఘనతగా చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా ‘బాహుబలి’ పాత్రలో ఉన్న ప్రభాస్ విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. అది ఒక పాత్రకు సంబంధించిన విగ్రహం. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నది మహేశ్ వ్యక్తిగత మైనపు విగ్రహం కావడంతో మహేశ్‌తో పాటు అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related Posts