YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అయ్యన్నా... లెక్కెంటీ...

అయ్యన్నా... లెక్కెంటీ...

విశాఖపట్టణం, మే 5, 
తెలుగుదేశంలో రాజకీయ పరిణామాలు చూస్తూంటే ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఆ పార్టీలో ఎవరికి వారే నాయకులు. టీడీపీలో ఏక నాయకత్వం ఉంటుంది. పైగా క్రమశిక్షణ కలిగిన పార్టీగా కూడా చెప్పుకుంటారు. పై స్థాయిలో ఒక మాట చెబితే కిక్కురుమనకుండా దిగువ స్థాయి దాకా అమలు చేసే విధేయత ఆ పార్టీకే చెల్లు. కానీ ఇటీవల కాలంలో మాత్రం టీడీపీలో కూడా కాంగ్రెస్ పోకడలు గట్టిగానే కనిపిస్తున్నాయి. పరిషత్ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని సాక్షాత్తూ చంద్రబాబే గ‌ట్టిగా చెప్పినా తమ్ముళ్ళు ధిక్కరించి మరీ బరిలో నిలిచారు. ఇలాంటి ఉదాహరణలు ఈ మధ్య చాలానే కనిపిస్తున్నాయితెలుగుదేశం పార్టీలో ఎవరు ఏ పదవిలో ఉన్నా సూపర్ బాస్ చంద్రబాబే. అయితే విధేయుడుగా ఉంటారనుకుని బీసీ నేత అయిన అచ్చెన్నాయుడిని ఏరి కోరి మరీ బాబు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. చిత్రంగా అదే అచ్చెన్న నోటి నుంచి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి. పైగా భావి వారసుడు లోకేష్ మీద కూడా అచ్చెన్న చేసిన కామెంట్స్ తో అధినాయకత్వానికి దిమ్మతిరిగిపోయింది. అయితే అచ్చెన్న మీద సీరియస్ యాక్షన్ ఉంటుందా అంటే చెప్పలేం అని అంటున్నారు కానీ ఉండదు అని ఎవరూ అనలేకపోతున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు కాబట్టి సరైన సమయంలోనే కీలక నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు.గతసారి టీడీపీ ప్రెసిడెంట్ పదవికి తానే అర్హుడిని అని అయ్యన్నపాత్రుడు భావించారు. తనకు ఆ పదవి ఇస్తారని కూడా ఎంతగానో ఊహించారు. కానీ నాడు జగన్ సర్కార్ అచ్చెన్న మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా హైలెట్ అయ్యారు. దాన్ని సొమ్ము చేసుకోవడానికి చంద్రబాబు ఆయనకు పదవి అప్పచెప్పారు. అయితే అచ్చెన్న వల్ల ఉత్తరాంధ్రాలో పార్టీకి విజయాలు దక్కలేదు సరికదా లోకల్ బాడీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. దానికి తోడు అచ్చెన్న సొంతంగా ముందుకు సాగే నైజం కూడా అధినాయకత్వానికి చికాకు పెడుతోంది. పైగా లోకేష్ కి మొదటి నుంచి అచ్చెన్న నియామకం ఇష్టం లేదు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన మీదట ఈసారి తనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఖాయమని అయ్యన్నపాత్రుడు భావిస్తున్నట్లుగా ఉందిట.ఏనాడూ చంద్రబాబు కూడా జగన్ మీద ఇంత దారుణంగా కామెంట్స్ చేయలేదు. కానీ అయ్యన్నపాత్రుడు ఎపుడూ జగన్ మీద హార్ష్ గానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన పిచ్చోడి పాలన అంటూ జగన్ ని కడిగిపారేశారు. ఇక ప్రతీ రోజూ జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తూ ఏపీ రాజకీయాల్లోనే అలజడి రేపుతున్నారు. దీని వెనక వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయని అంటున్నారు. తాను కనుక పార్టీ ప్రెసిడెంట్ అయితే ఇంతకు పదింతలు జగన్ని ఎదిరించి పార్టీని పటిష్టం చేస్తాను అన్న సిగ్నల్స్ ని అయ్యన్నపాత్రుడు చంద్రబాబుకే డైరెక్ట్ గా పంపుతున్నారు అంటున్నారు. పైగా అయ్యన్నకు మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. ఆయన లోకేష్ కి అత్యంత సన్నిహితుడు. లోకేష్ ఎలా చెబితే అలా అన్నట్లుగా అయ్యన్న వ్యవహరిస్తారు. దీంతో లోకేష్ చూపు కూడా అయ్యన్న మీద పడే అవకాశం ఉంది అంటున్నారు. ఇక అచ్చెన్న, అయ్యన్న ఒకే సామాజిక వర్గం. సో అచ్చెన్నను అయ్యన్నతో రీప్లేస్ చేసినా ఏ ముప్పూ రాదు, ఏ తప్పూ లేదు అన్న ఫీలింగ్ అయితే హై కమాండ్ కి ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts