YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మళ్లీ తగ్గిన కార్ల సేల్స్

మళ్లీ తగ్గిన కార్ల సేల్స్

ముంబై, మే 5, 
మారుతి సుజుకీ  కిందటి నెలలో 1,59,691 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను అమ్మగలిగింది. ఇవి ఈ ఏడాది మార్చిలో అమ్మిన 1,67,014 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ కంటే 4 శాతం తక్కువ.  లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ కొనసాగడంతో కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ఒక్క వెహికల్‌‌‌‌‌‌‌‌ను కూడా కంపెనీ విక్రయించలేకపోయింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో సేల్స్‌‌‌‌‌‌‌‌ తగ్గాయని కంపెనీ తెలిపింది. దేశీయంగా 1,42,454 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను అమ్మామని మారుతి సుజుకీ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  ఆల్టో, ఎస్‌‌‌‌‌‌‌‌ప్రెస్సో వంటి మినీ కార్ల అమ్మకాలు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో మార్చితో పోల్చుకుంటే 2 శాతం పెరిగి 25,041 యూనిట్లుగా నమోదయ్యాయి.  స్విఫ్ట్‌‌‌‌‌‌‌‌, సెలెరియో, ఇగ్నిస్‌‌‌‌‌‌‌‌, బాలెనో, డిజైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కాంపాక్ట్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్ వెహికల్ సేల్స్‌‌‌‌‌‌‌‌ 12 శాతం తగ్గి 72,318 యూనిట్లుగా రికార్డయ్యాయి. సియాజ్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌ 4 శాతం తగ్గి 1,567 యూనిట్లుగా, విటారా బ్రెజ్జా, ఎస్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌, ఎర్టిగా సేల్స్‌‌‌‌‌‌‌‌ మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో  3 శాతం తగ్గి 25,484 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 17,237 యూనిట్లను కంపెనీ ఎగుమతి చేయగలిగింది. మరోవైపు హ్యుండయ్‌‌‌‌‌‌‌‌ మోటార్ ఇండియా సేల్స్‌‌‌‌‌‌‌‌ కూడా కిందటి నెలలో పడ్డాయి. కంపెనీ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 59,203 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను అమ్మింది. ఈ ఏడాది మార్చిలో  సేల్‌‌‌‌‌‌‌‌ చేసిన 64,621 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ కంటే ఈ అమ్మకాలు 8 శాతం తక్కువ. దేశీయంగా 49,002 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను సేల్‌‌‌‌‌‌‌‌ చేయగలిగింది.  కిందటి నెలలో10,201 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను ఎగుమతి చేసింది. కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ కొనసాగినప్పటికీ 1,341 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను హ్యుండయ్‌‌‌‌‌‌‌‌ ఎగుమతి చేయగలిగింది.కిందటి నెలలో హోండా కార్స్ ఇండియా 9,072 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను సేల్ చేయగలిగింది. కంపెనీ అమ్మకాలు ఈ ఏడాది మార్చితో పోల్చుకుంటే 28 శాతం పెరగడం విశేషం. మార్చిలో 7,103 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను విక్రయించింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 970 యూనిట్లను ఎగుమతి చేశామని హోండా ప్రకటించింది. మరోవైపు టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలలో 41 శాతం తగ్గాయి. కంపెనీ ఈ ఏడాది మార్చిలో 66,609 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను అమ్మగా, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 39,530 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను సేల్ చేయగలిగింది. కిందటి నెలలో దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో 25,095 ప్యాసెంజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను, 14,435 కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను  అమ్మగలిగామని టాటా మోటార్స్ ప్రకటించింది. కిందటి నెలలో 9,622 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను టయోటా కిర్లోస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మింది. ఎంజీ మోటార్ ఇండియా 2,565 యూనిట్లను సేల్‌‌‌‌‌‌‌‌ చేయగలిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 10 శాతం తగ్గి 36,437 యూనిట్లుగా నమోదయ్యాయి.

Related Posts