YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సామాజిక వర్గంలో లోకేష్ కు చిక్కని పట్టు

సామాజిక వర్గంలో లోకేష్ కు  చిక్కని పట్టు

విజయవాడ, మే 6, 
ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఒక చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్‌ను సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన క‌మ్మ నాయ‌కులు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ విష‌యాన్ని ఎవ‌రూ దాచ‌కుండా బ‌హిరంగ వేదిక‌ల‌పైనే చెబుతుండ‌డం ఆస‌క్తిగా మారింది. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు… పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ మంత్రిగా ఉన్నప్పటి నుంచే చాలా మంది క‌మ్మ నేత‌లు లోకేష్‌పై అస‌హ‌నంతోనే ఉన్నారు. అయితే పార్టీ అధికారంలో ఉండ‌డం… లోకేష్ మంత్రిగా ఉండ‌డంతో ఎవ్వరూ బ‌య‌ట‌పడ‌లేదు.పార్టీ ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోవ‌డం.. ఆ త‌ర్వాత లోకేష్ సైతం ఓడిపోయిన‌ప్పటి నుంచి లోకేష్ పార్టీని వీడుతున్న వాళ్లకు, పార్టీలో ఉన్న క‌మ్మల‌కు గ‌ట్టిగా టార్గెట్ అయిపోతున్నాడు. గ‌తంలో టీడీపీలో గెలిచిన గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్ సైతం.. లోకేష్‌పై తీవ్రవ్యాఖ్యలు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్లు గుర్తు చేస్తున్నారు. “మాలో చాలా మందికి ఆయ‌న‌పై సంతృప్తి లేదు. అలాగ‌ని బ‌య‌ట‌ప‌డ‌లేం“ అని రాజ‌మండ్రికి చెందిన ఒక సీనియ‌ర్ మోస్ట్ వ్యాఖ్యానించారు. ఇక‌, సీమ‌కు చెందిన క‌మ్మ నాయ‌కులు, ఏకంగా ఓ కుటుంబం కూడా లోకేష్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌న‌ను పూచిక పుల్లను తీసి పారేసిన‌ట్టు పారేస్తోంది.ఇక‌, కోస్తాంధ్రకు చెందిన వారు కూడా లోకేష్ కు ఎక్కడా విలువ ఇవ్వడం లేదు. “ఆయ‌న వ‌ల్ల మాకేం ఒరిగింది. అధికారంలో ఉన్నప్పుడు అంతా నేనే అన్నట్టుగా వ్యవ‌హ‌రించాడు. క‌నీసం.. మేం చేసుకునే వ్యాపారాల‌ను కూడా ప‌ట్టించుకోకుండా.. నాకేంటి .. అనే ధోర‌ణిలోనే వ్యవ‌హ‌రించారు“ అని కృష్ణాకు చెందిన క‌మ్మ నేత‌లు వాపోతున్న ప‌రిస్థితి. పార్టీలో యువ క‌మ్మ నేత‌ల‌కు కూడా లోకేష్‌పై గురి లేదు. లోకేష్‌ను న‌మ్ముకుంటే భ‌విష్యత్తు లేద‌నే వారి పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. ఇందుకు క‌ర‌ణం వెంక‌టేష్‌, దేవినేని అవినాషే ఉదాహ‌ర‌ణ‌. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి ఇప్పటికిప్పుడు లోకేష్‌పై వీరిలో వ్యతిరేక‌త వ‌చ్చింద‌ని చెప్పలేం. ఆయ‌న‌పై అధికారంలో ఉన్న నాటి నుంచి ఈ వ‌ర్గం దూరంగానే ఉన్నార‌ని తెలుస్తోంది.మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే లోకేష్ త‌న పంచాయి‌తీరాజ్ శాఖకి సంబంధించి.. క‌మీష‌న్ కోసం బేరం పెట్టార‌ని.. గుంటూరుకు చెందిన క‌మ్మ మాజీ ఎమ్మెల్యే ఒక‌రు ఇటీవ‌ల బ‌ర‌స్ట్ అయ్యారంటే.. లోకేష్‌పై నేత‌ల్లో ఏ రేంజ్‌లో క‌సి ఉందో అర్ధమ‌వుతోంది. ఇక‌, మంగ‌ళ‌గిరిలో ఆయ‌న ఓడిపోయిన విష‌యం తెలిసిందే. కానీ, ఆయ‌న ఓడిపోవాల‌ని కోరుకున్న వారు కూడా ఉన్నార‌ని తెలిస్తే.. ఆశ్చర్యం అనిపించ‌క‌మాన‌దు. ఇది నిజ‌మేన‌ని కొంద‌రు అత్యంత ర‌హ‌స్యంగా చెబుతున్నారు. ఈ విష‌యం చంద్రబాబుకు కూడా తెలిసింద‌ని.. కానీ, పైకి చెబితే.. మ‌రింత ప‌రువు పోతుంద‌ని ఆయ‌న మౌనం పాటిస్తున్నార‌ని అంటున్నారు. మొత్తానికి.. సొంత పార్టీలో లోకేష్‌కి తీవ్ర వ్యతిరేక‌త సొంత సామాజిక వ‌ర్గం నుంచే వ్యక్తం కావ‌డం గ‌మ‌నార్హం.

Related Posts