YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బాబును మించి పళని కమిట్ మెంట్

బాబును మించి పళని కమిట్ మెంట్

చెన్నై, మే 6,
పొరుగు ఉన్న రాష్ట్రాలతో రాజకీయాలను తప్పనిసరిగా పోల్చుకుంటాం. అందునా సరిహద్దు ఉన్న రాష్ట్ర రాజకీయాలను ప్రజలు కూడా నిశితంగా పరిశీలిస్తారు. అయితే నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పళనిస్వామి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దాదాపు పదమూడేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పాలన సమయంలో ఏం చేశారన్న ప్రశ్న ఇప్పుడు చర్చ జరుగుతోంది.తమిళనాడులో పళనిస్వామికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. ఆయన అమ్మ చాటు నేతగానే ఎదిగారు. అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయి దాదాపు నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో పళనిస్వామి తమిళ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. జయలలిత పథకాలను కొనసాగించారు. అవినీతికి తావులేకుండా, అభివృద్ధిపైనే పళనిస్వామి దృష్టి పెట్టారు. అందుకే ఆయనకు దాదాపు 65 స్థానాలను కట్టబెట్టారు. కానీ చంద్రబాబుకు ఇది సాధ్యం కాలేదు.తన ఐదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అవినీతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఆరు వేల కోట్ల రూపాయలు దుబారా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. రాజధాని అమరావతిని, పోలవరాన్ని బూచిగా చూపి ప్రజలను మభ్యపెట్టాలని చూశారు. రాజధాని అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా తాత్కాలిక భవనాల నిర్మాణాలకే వేల కోట్లు ఖర్చుచేశారు. సంక్షేమ పథకాల్లో కోత విధించారు.పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటం, నేతల నుంచి వత్తిడి పెరగడంతో చంద్రబాబు అప్పట్లో అభివృద్ధి కన్నా ఇతర వ్యాపకాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇవన్నీ గమనించిన ప్రజలు చంద్రబాబును దారుణంగా ఓడించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. ఇంకా ఓటములను చవి చూస్తేనే ఉన్నారు. పాలన అంటే అనుభవం ఒక్కటే చాలదని, దానికి కమిట్ మెంట్ అవసరమని పళనిస్వామిని చూసి నేర్చుకోవాలని సొంత పార్టీ నుంచే కామెంట్స్ వినపడుతున్నాయి.

Related Posts