YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయింది

అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయింది

హైదరాబాద్, మే 6, 

అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయింది తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచిన అజిత్ సింగ్ వాజపేయి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ వరంగల్ సభకు హాజరైన ముఖ్యులు అజిత్ సింగ్ అజిత్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం  రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.
కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ ( ఆర్.ఎల్.డీ ) జాతీయ అధ్యక్షుడు అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి అజిత్ సింగ్ మొదటి నుంచి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని ఆయన తెలిపారు. 2003 లో వరంగల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు అప్పటి ఎన్డీయే నేతృత్వంలోని వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి గా ఉంటూ అజిత్ సింగ్ హాజరయ్యారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం లేఖను రాసిన మహా నాయకుడు అజిత్ సింగ్ అని ఆయన పేర్కొన్నారు. అప్పటి ఉద్యమ నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు, తనకు అజిత్ సింగ్ అత్యంత సన్నిహితులు అని వినోద్ కుమార్ తెలిపారు. మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు అయిన అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం హరిత ప్రదేశ్ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించిన ఘనులు అని ఆయన అన్నారు. అజిత్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Related Posts