YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క‌రోనా వేళ‌..వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

క‌రోనా వేళ‌..వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

న్యూఢిల్లీ మే 6
ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఫ‌లితాలు వెలువ‌డిన మ‌రుస‌టి రోజు నుంచే దేశీయ చ‌మురు కంపెనీలు ధ‌ర‌ల‌ను పెంచుతూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా మూడో రోజూ వాహ‌ణ‌దారుల‌పై భారం మోపాయి. నిన్న లీట‌ర్ పెట్రోల్‌పై 19 పైస‌లు, లీటర్ డీజిల్‌పై 21 పైసల చొప్పున పెంచ‌గా, ఇవాళ మరోసారి 25 పైస‌లు, 30 పైస‌ల చొప్పున బాదాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.90.99, డీజిల్‌ రూ.81.42కు చేరింది. ఇక తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్‌ రూ.88.39, చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.35, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.14, డీజిల్‌ రూ.84.26కు చేరాయి.ఇక బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.01, డీజిల్‌ రూ.86.31కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.57, డీజిల్‌ రూ.88.77కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.03, డీజిల్‌ రూ.89.62కు చేరాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ‌మైన ప‌న్నులు విధిస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి.

Related Posts