YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న‌ సీఎం కేసీఆర్..

క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న‌ సీఎం కేసీఆర్..

హైద‌రాబాద్ మే 6
క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ ప్ర‌గ‌తి భ‌వ‌న్ చేరుకున్నారు. ఏప్రిల్‌ 19న సీఎం కేసీఆర్‌ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలుండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టు ఆయ‌న వ్య‌క్తిగ‌త వైద్యుడు ఎంవీ రావు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో 20 రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు.ముఖ్యమంత్రికి ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌తోపాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నట్టు తేలింది. దీంతో సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకొన్నట్టు వైద్యులు నిర్ధారించారు.

Related Posts