అమరావతి మే 6
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణతో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. దీంతో ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవడాని ప్రభుత్వం అనుమతిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. గురువారం నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకే బ్యాంకులు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత నానాటికీ అధికమవుతుండటంతో ప్రభుత్వం నివారణా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిన్‌్టి నుంచి రాష్ట్రంలో ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు చేస్తున్నది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు రెండు వారాలపాటు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీళ్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.