YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్సీ వద్దంటున్న కడియం

ఎమ్మెల్సీ వద్దంటున్న కడియం

వరంగల్, మే 7, 
తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్ నేత కడియం శ్రీహరి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. తనకు ఎమ్మెల్సీ పదవి వద్దని అధిష్టానానికి చెప్పినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి మరో మూడు నెలల్లో ముగుస్తుంది. సామాజికవర్గం పరంగా, సీనియర్ నేతగా కడియం శ్రీహరికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి రెన్యువల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాని కడియం శ్రీహరి మాత్రం తనకు ఎమ్మెల్సీ పదవి వద్దని చెబుతుండటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.కడియం శ్రీహరి 2014 ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా విజయం సాధించారు. అయితే అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య మీద అవినీతి ఆరోపణలు రావడంతో కడియం శ్రీహరిని ఎంపీ పదవికి రాజీనామా చేయించి కేసీఆర్ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా నియమించారు. అయితే 2018 ఎన్నికల్లో కడియం శ్రీహరి తన కుమార్తెకు స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ను ఆశించారు.అయతే కేసీఆర్ తిరిగి రాజయ్యకే స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ను కేటాయించారు. కడియం శ్రీహరికి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఎమ్మెల్సీ అయినందునే తనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న భావన ఒకవైపు, స్టేషన్ ఘన్ పూర్ తన చేజారి పోతుందన్న ఆందోళన మరోవైపు కడియం శ్రీహరిని వేధిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి తాను పోటీ చేయడానికి కడియం శ్రీహరి రంగం సిద్దం చేసుకుంటున్నారని తెలిసింది.కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి కాలం జూన్ నాటికి ముగియనుంది. ఆయన సామాజికవర్గం తెలంగాణలో బలంగా ఉండటంతో కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేసే అవకాశముంది. కానీ 2023లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కడియం శ్రీహరి తనకు ఎమ్మెల్సీ పదవిని వద్దంటున్నారన్న టాక్ విన్పిస్తుంది. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేయాలన్న యోచనలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సొంత పార్టీలోని తన ప్రత్యర్థి రాజయ్యకు చెక్ పెట్టొచ్చు. అదే సమయంలో ఎమ్మెల్యేగా ఉంటే మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలున్నాయి. అందుకే ఇటీవల కాలంలో ఆయన రాజయ్య మీద దూకుడు పెంచారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts