విశాఖపట్నం
విషాద ఘటనకు ఏడాది పూర్తయింది.12 మంది జీవితాలను పొట్టన పెట్టు కున్న విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘట న చేదు జ్ఞాపకాలు నేటికి వెంటాడు తూనే ఉన్నాయి.ఏడా ది క్రితం వారి జీవితాల్లో నింపిన చీకట్లు నేటికి వారి కళ్ళు ముందు కదలాడు తూనే ఉన్నాయి. విశాఖ ప్రజల జీవితాల్లో ఎల్ జి పాలిమర్స్ ఘటన పీడకలగా మిగిలి పోయింది.విష వాయువు 12 మందిని పొట్టన పెట్టుకుంది.వేలాది మందిని అచేతనంగా మార్చేసింది.ఈ ఘటన పై స్పందించిన సీఎం జగన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని స్వయం గా పరామర్శించారు.మృతులకు పరిహారాన్ని కూడా అందించారు.నాటి భయా నక పరిస్థితులు ఇప్పటికీ వెంకటా పురం, వెంకటాద్రిగార్డెన్, పద్మనా భనగర్, జనతాకాలనీ వాసుల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నా యి.నగరంలోని ఇతర ప్రాంతాలకు స్టైరీన్ విషవాయువు వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నగరవాసులకు మూడు రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసింది.స్టైరీన్ ట్యాంకు పేలిపోతుందనే వదంతులతో అడవివరం, వేపగుంట, పెందుర్తి, చినముషిడివాడ, సుజాతనగర్ తది తర ప్రాంతాల వాసులు ఇళ్లు వదలి రోడ్లపైకి వచ్చేశారు.రాత్రంతా రోడ్లపై బిక్కుబిక్కుమంటూ తిరుగుతూనే ఉన్నారు.. నాటి విషాద ఘటనకు ఏడాది పూర్తవుతోంది.స్టెరీన్ ప్రభావం తో అప్పట్లో 11 గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు 1961లో హిందూస్తాన్ పాలిమర్స్ పేరుతో ఈ కంపెనీని ప్రారంభించారు. 1978లో దీనిని యూబీ గ్రూప్ తీసుకో గా.. 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ గ్రూప్ ఈ కంపెనీని తీసుకుంది.అయితే ఏడాది క్రితం గ్యాస్ లీక్ తో రేపిన విషాదంతో ఆ గ్రామ ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు.ఆ ఘటనలో మృతి చెందిన వారికి అంజలి ఘటించారు.