విశాఖపట్నం
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి,మిగిలిన అన్ని శాఖల పనులను తాత్కాలికంగా నిలిపివేసి, వాటి నిధులను ఆరోగ్యానికి ఖర్చు చేయాలని మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్ చేశారు.ముందు చూపు లేకపోవడం, నాయకత్వలోపం వల్లే దేశంలో, రాష్ట్రంలో కరోనా విజ్రుంబిస్తోందని,రాష్ట్రంలో కరోనా లెక్కలన్నీ తప్పుల తడకలే సీఎం నుంచి మంత్రులు, అధికారుల వరకు కరోనాను నిర్లక్ష్యం చేస్తున్నారని,సాక్షాత్తూ న్యాయస్థానాలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు.క్యాబినెట్ సమావేశంలో 32 అంశంగా కరోనాపై ప్రభుత్వ ప్రజా ప్రతినిదులు చర్చించారంటే, దానికి సీఎం ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోందని చెప్పారు..