YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కొవిడ్ పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారంపై భార‌త ప్ర‌భుత్వం ప‌లు సూచ‌న‌లు

కొవిడ్ పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారంపై భార‌త ప్ర‌భుత్వం ప‌లు సూచ‌న‌లు

న్యూఢిల్లీ మే 7
క‌రోనా బారిన పడిన పేషెంట్లు మందుల కంటే కూడా ఎక్కువ‌గా పౌష్టికాహారంపై దృష్టి పెట్టాల‌ని ఎన్నో రోజులుగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన రోగ‌నిరోధ‌క శ‌క్తి ఈ వైర‌స్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటుంద‌ని, అందువ‌ల్ల స‌రైన ఆహారం చాలా ముఖ్య‌మ‌ని డాక్ట‌ర్లు కూడా సూచిస్తున్నారు. తాజాగా భార‌త ప్ర‌భుత్వం కూడా కొవిడ్ పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారంపై ప‌లు సూచ‌న‌లు చేసింది. ఈ మేర‌కు MyGovIndia ఓ ట్వీట్ చేసింది. అందులో ఏమున్నాయో ఒక‌సారి చూద్దాం.త‌గిన స్థాయిలో విట‌మిన్లు, ఖ‌నిజాలు శ‌రీరానికి అంద‌డానికి ఐదు ర‌కాలు పండ్లు, కూర‌గాయ‌లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.క‌రోనా తాలూకు ఆందోళ‌న‌ను అదుపులో ఉంచుకోవ‌డానికి 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు కొద్ది మొత్తంలో తీసుకోవాలి.రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డానికి ప్ర‌తి రోజూ ఒక‌సారి ప‌సుపు పాలు తాగాలి.రోజూ త‌క్కువ మొత్తంలో ఎక్కువ‌సార్లు తినాలి. ఆహారంలో ఆమ్‌చూర్ (మామిడి పొడి) ఉండేలా చూసుకోవాలి.రాగి, ఓట్స్‌లాంటి తృణ‌ధాన్యాలుప్రొటీన్ ఎక్కువ‌గా అందించే చికెన్‌, ఫిష్‌, గుడ్లు, ప‌నీర్‌, సోయా, కాయ‌గింజ‌లుబాదాం, వాల్‌న‌ట్స్‌, ఆలివ్ ఆయిల్‌దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న వేళ హాస్పిట‌ల్స్ అవ‌స‌రం రాకుండా ఇంట్లోనే ఉండి కోలుకునే వారి సంఖ్యను పెంచ‌డానికి మెరుగైన ఆహార‌మే మార్గ‌మ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. స‌రైన ఆహారం తీసుకుంటే 80 నుంచి 85 శాతం పేషెంట్లు ఇంట్లోనే కోలుకుంటున్న‌ట్లు స్పష్టం చేసింది.
 

Related Posts