చిత్తూరు
భారీ చోరీ కేసును చిత్తూరు పోలీసులు ఎట్టకేలకు చేధించారు. అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి మూడు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలను , 90 లక్షల రూపాయల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దొంగలు అతి చాకచక్యంగా ఎలాంటి ఆధారాలు లేకుండా దోచుకెళ్లిన ప్పటికీ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారిని అరెస్టు చేసి వారినుంచి భారీ ఎత్తున చోరీ అయిన వజ్రాలు, బంగారు ఆభరణాలు విదేశీ కరెన్సీ రికవరీ చేయ గలిగారు ,ఈ నెల 29వ తేదీన చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కు స్వయానా సోదరుడు బద్రి నారాయణ ఇంట్లో పెద్ద ఎత్తున చోరీ జరిగిన విషయం తెలిసిందే , చిత్తూరు నగరం బి వి రెడ్డి కాలనీ లోని పై అంతస్తులో బద్రి నారాయణ అతని కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా కింది అంతస్తులో దొంగలు చాకచక్యంగా దోచుకెళ్లారు , ఈ కేసును చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ , చిత్తూరు సబ్ డివిజినల్ పోలీస్ అధికారి సుధాకర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు , విశాఖపట్నం జిల్లా కొత్త గాజువాక కు చెందిన కర్రీ సతీష్ అలియాస్ సత్తిబాబు, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చెన్నం పేట మండలంకు చెందిన నరేంద్ర లను అరెస్ట్ చేశారు వీరిద్దరూ కూడా అంతర్రాష్ట్ర నేరస్తులు ఈ కేసులో చోరీ సొత్తు కొనుగోలు చేసిన కడప జిల్లా రాయచోటికి చెందిన అనిల్ కుమార్ ఆచారి ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, నిందితుల వద్ద ద్విచక్ర వాహనం బుల్లెట్ రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ సెంథిల్కుమార్ శుక్రవారం చిత్తూరులో మీడియాకు తెలిపారు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు ఈ మీడియా సమావేశంలో చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి క సిఐ లు రమేష్. , యుగంధర్ , నరసింహ రాజు పాల్గొన్నారు