YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టిఆర్ఎస్ లో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపిన ఏనుగు

టిఆర్ఎస్ లో  సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపిన ఏనుగు

హైదరాబాద్ మే 7

టిఆర్ఎస్ లో  సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపిన ఏనుగు ఈటెలతో జతకట్టిన మంత్రి హరీష్ రావు ఆత్మీయ సహచరుడు రవీందర్ రెడ్డి.
ఉత్తర తెలంగాణలో సీనియర్ టిఆరెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరుగుబాటు నేత ఈటెల రాజేందర్ తో జతకట్టనున్నారు..గురువారం రాత్రి ఏనుగు రవీందర్ రెడ్డి నేరుగా ఈటెలను కలిసి సంఘీభావం ప్రకటించారు.. ఈ పరిణామం టిఆరెస్ లో  సంచలనం సృష్టిస్తోంది.. మంత్రి హరీష్ రావు కు అత్యంత నమ్మకమైన రాజకీయ సహచరుడిగా మెదులుతున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెలను కలవడం రాజకీయ ప్రకంపనలకు దారితీయబోతోంది..2004 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన రవీందర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు..15 ఏళ్ళ పదవీ కాలంలో హరీష్ రావు వెంటే నీడలా ఉన్నారు..పొద్దున్నుండి రాత్రి వరకు హరీష్ వెంటే ఉండేవారు..2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ చేతిలో ఓడిపోయినప్పటికి…హరీష్ రావు తో బంధం వీడలేదు..కొద్దికాలానికే కాంగ్రెస్ నుంచి సురేందర్ కారెక్కడంతో సిట్టింగ్ హోదాలో ఉన్న జాజులను కాదనే పరిస్థితి లేకుండా పోయింది హరీష్ రావు కు..అయినా రవీందర్ రెడ్డి తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు హరీష్ రావు..సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్,తాజా మాజీ ఎమ్మెల్యేగా ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి గడ్డపై దాయాదుల మాదిరిగానే వ్యవహరించారు.. ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.. ఒక ఒరలో రెండు కత్తుల వలె వ్యవహారం ముదరడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులకంటే తన వెంట ఉన్న అనుయాయుల పనులు పోటీ పడి చేయిస్తూ ఏనుగు రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకుంటున్నారు.. దీంట్లో రెండేళ్లు మంత్రి ఈటెల రాజేందర్ సహకారం తీసుకున్నారు ఏనుగు..దీనికి తోడు హరీశ్రావ్..ఈటెలతో 20 ఏళ్ల రాజకీయ అనుబంధం సైతం రవీందర్ రెడ్డిని ఈటెల దరిచేర్చింది..    సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో…సమయం చూసి అడుగేయడంలో రవీందర్ రెడ్డి సిద్ద హస్తుడు.. మొన్నటి వరకు అనుయాయులందరు కట్టకట్టుకొని బీజేపీలో చేరడం ద్వారా టిఆరెస్ కు షాక్ ఇద్దామని రవీందర్ రెడ్డిపై తీవ్రంగా ఒత్తిడి పెంచారు..అయితే ఇది సరైన సమయం కాదని..కొద్ది కాలం వేచిచూద్దామని క్యాడర్ కు నచ్చ చెప్పారు..అప్పటికే ఈటెల రాజేందర్ వ్యవహారంపై ఉప్పందడం వల్లనే క్యాడర్ను కొద్ది టైమ్ అడిగినట్లు కనపడుతోంది.. టిఆరెస్ తరపున 2004 లో సంతోష్ రెడ్డి,కేశపల్లి గంగారెడ్డి తో పాటు రవీందర్ రెడ్డి అసెంబ్లీ మెట్లెక్కారు.. అప్పటి నుంచి టిఆరెస్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖుడిగా ఎదిగారు.. కేసీఆర్ కు సన్నిహితంగా  ఉంటూనే…ఉమ్మడి నిజామాబాద్ టిఆరెస్ రాజకీయాల్లో చక్రం తిప్పారు…ఉత్తర తెలంగాణ స్థాయిలో ముఖ్య నేతగా ఎదిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెల రాజేందర్ తో జతకట్టిన బడా నేతల్లో మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నారు.. ఆరు రోజుల రాజకీయ సమికరణాలలో టిఆరెస్ లో ఈ స్థాయి కలిగిన నేత  బాహాటంగా ఈటెలను కలిసిన సందర్భం లేకపోవడం గమనార్హం.. ఇప్పటిదాకా ఈటెలకు మద్దతు తెలిపిన టిఆరెస్ నేతల్లో మండల స్థాయి నేతలే ఉన్నారు..ఉన్నా వారంతా హుజురాబాద్ ప్రాంత నేతలే…ఏనుగు రవీందర్ రాజకీయ మలుపు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది…

Related Posts