YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓ వైపు కరోనా... మరో వైపు అప్పులు కింద మీద పడుతున్న జగన్

ఓ వైపు కరోనా... మరో వైపు అప్పులు కింద మీద పడుతున్న జగన్

విజయవాడ, మే8, 
కాని కాలంలో తాడు అయినా పాములాగే పడగ విప్పుతుంది అంటారు. అది అచ్చం ఏపీ సర్కార్ విషయంలో సరిపోతుంది అనే అనాలి. ఏపీ సర్కార్ అసలే అప్పు చేసి పప్పు కూడు వండుతోంది. మేము మొత్తం అయినకాడికి అప్పులు చేసి పారేశాం, ఇక అప్పులు ఇచ్చేవాడు లేడు అన్నట్లుగా అసలు నిజాన్ని చెప్పి మరీ గద్దె దిగిపోయారు మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఇక జగన్ సీఎం అయ్యాక కూడా అదే కధ రిపీట్. యనమల వెళ్ళని తోవలు కూడా వెతికి మరీ అప్పులు తెచ్చి పబ్బం గడిపారు గత రెండేళ్ళుగా.ఇక యావత్తు లోకాన గత ఏడాది కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. దాని ఫలితంగా వచ్చిన లాక్ డౌన్ తో ఏపీ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. అది ఇంకా స్ట్రీమ్ లైన్ కాలేదు. ఈలోగానే సెకండ్ వేవ్ పేరిట కరోనా వచ్చిపడిపోయింది. మొదటి దశలో కేంద్ర సాయం కొంత అయినా అంది వచ్చేది. ఈసారి మాత్రం అంతా రాష్ట్రాల మీదనే భారం వేసేసింది కేంద్రం. ఆఖరుకు మెజారిటీ జనాలకు టీకాలు ఇచ్చే అతి ముఖ్య బాధ్యత కూడా రాష్ట్రాల మీదనే ఉంది. ఇంకో వైపు సవరించిన నిబంధనల ప్రకారం చూస్తే రాష్ట్రాలు ఎక్కడా కొత్త అప్పులు తెచ్చుకునే వీలు లేకుండా చేశారు. ఇలా ఆర్ధికంగా చూస్తే ఏపీ అష్ట దిగ్బంధనంలో చిక్కుకుంది అని చెప్పాలి.కరోనా అన్నది రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. లాక్ డౌన్ లాంటివి ప్రయోగిస్తే ఎంత వరకూ తగ్గుతుందో తెలియదు కానీ ఫస్ట్ జనాలు ఆకలితో చస్తారు. అలాగని జనాలకు రోడ్ల మీదకు విడిచిపెడితే కరోనా మహమ్మారి బారిన పడతారు. ఈ నేపధ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారే కరోనాతో ఎలా డీల్ చేయాలో తెలియక సతమతమవుతోంది. అలాగే ఆర్ధికంగా ఫరవాలేదు అనిపించుకున్న రాష్ట్రాలే కరోనా తాకిడికి చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఏపీలో జగన్ సర్కార్ కి ఇపుడు ఇది అతి పెద్ద సవాల్ అని అంటున్నారు. కరోనాతో ఆర్ధిక పతనంతో పాటు కొత్త ఖర్చులు పెరిగి మరీ ఖజానాను ఊడ్చేస్తాయి.రాజకీయంగా ప్రత్యర్ధులను జగన్ ఈజీగానే తట్టుకుంటున్నారు. ఇక ఒడిదుడుకులతో ఏదో విధంగా పాలన సాగిస్తున్నారు. మొదటి దశ కరోనా దెబ్బకే అనుకున్న ప్రణాళికలు అన్నీ దారి తప్పాయి. ఇపుడు దానికి మించి అన్నట్లుగా విరుచుకుపడుతున్న సెకండ్ వేవ్ తో వైసీపీ సర్కార్ కిందా మీద అవుతోంది. ఈ నేపధ్యంలో నుంచి ఉత్పన్నమయ్యే అనేకేనేక ఇతరమైన సమస్యలతో జనాలు కూడా అష్టకష్టాలు పడడం ఖాయం. అలా వారి నుంచి పెద్ద ఎత్తున పుట్టే అసంతృప్తి సెగలు నేరుగా జగన్ సర్కార్ కే తాకుతాయి అన్నది ఒక విశ్లేషణ. ఎన్నో రకాలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా కూడా రాని అసంతృప్తి ఒక్క కరోనా విషయంలోనే మోడీ సర్కార్ కి జనాల నుంచి వచ్చేసింది. దీనికి జగన్ కూడా అతీతుడు కాడు అన్న మాట అయితే వినిపిస్తోంది. మరి దీని నుంచి జగన్ తట్టుకుని బయటపడితే నిజమైన విజేతగానే చూడాలి.

Related Posts