YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెరిగిన భానుడి ప్రతాపం

పెరిగిన భానుడి ప్రతాపం

భానుని ప్రతాపానికి భద్రాద్రి భగ్గుమంటుంది. ఒక ప్రక్క ఎడారిలా మారిన గోదావరి, మరోప్రక్క సింగరేణి బొగ్గు కోలిమి కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడు రోజులుగా ఎండలు పెరిగిపోయాయి. కొత్తగూడెంలో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరింది. సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది. దీంతో కాస్త ఉపశమనం లభిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం వరకు ఎండలు పెరగలేదు. వర్షాలు, గాలిదుమారం వల్ల వాతావరణం చల్లబడింది. అయితే మూడు రోజుల నుంచి జిల్లాలో 39 నుంచి 42,43  డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత పెరిగింది. రోడ్లు 11 గంటలకే నిర్మనుషంగా కనిపిస్తున్నాయి.. సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ బీపీఎల్, నవభారత్, హెవీ వాటర్ ప్రాజెక్ట్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో అదనంగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీంతో ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. కార్మికులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇప్పటికే పట్టణ ప్రాంతాలతోపాటు మండలాల్లో కొబ్బరి బోండాలు, శీతల పానీయాలకు తాటి ముంజలు,పుచ్చకాయలు.చలువ పదార్ధలకు డిమాండ్ పెరిగింది. ఉష్ణోగ్రతలు అధికం గా ఉండటం వల్ల మధ్యాహ్నం ప్రయాణికులు బస్సుల్లో పెద్దగా ప్రయాణించడం లేదు. పలుచోట్ల ప్రజలు వడదెబ్బతో ఆసుపత్రుల పాలవుతున్నారు.ఎండల తీవ్రతతో కూలర్లు, ఏసీలకు డిమాండ్ పెరిగింది  మొన్నటి వరకు రాముని కళ్యాణంతో పచ్చతోరణంలా కళకళలాడిన భద్రాచలం రెండు మూడురోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో 44.2 డిగ్రీలు నమోదైంది భద్రాచలంలో. ఇప్పుడే ఇంత ఉష్ణోగ్రత ఉండే మే నెలల 47 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతుందని చెబుతున్నారు వాతావరణ కేంద్ర అధికారులు. భద్రాచలం తో పాటూ కొన్ని మణుగూరు,కొత్తగూడెం ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాల్వంచ మండలం యానాంబైలు గ్రామంలో 44.1 డిగ్రీలు, దుమ్ముగూడెంలో 44 డిగ్రీలు, భద్రాచలం రూరల్లో 43.9 డిగ్రీలు, ఖమ్మం జిల్లా వైరాలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత పదేళ్లలో పోలిస్తే ఏప్రిల్ 25 నాటికి ఎప్పుడు కూడా ఉష్ణోగ్రత 44 డిగ్రీల కన్నా తక్కువే ఉండేదని, మొదటిసారి ఇంత ఎక్కు ఎండలు కాస్తున్నాయని చెప్పారు.  ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎండలు మరింత మండుతాయని అర్థమవుతోంది. మే నెలలో వడగాడ్పులు కూడా వీస్తాయని, తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో 48.49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను ఎండలో తిరగనివ్వకూడదని వైద్యులు  చేపుతున్నారు. ఎండ ప్రభావాన్నితట్టుకోలేక ఉపసమనం కోసం కొబ్బరినీళ్లు,శీతలపానియాలు ,ముంజలు,వంటి వాటిని  తీసుకుంటున్నామని ...ఆహారం తీసుకోవడం కష్టంగా వుందని ప్రజలు చెపుతున్నారు.

Related Posts