YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వెల్లంపల్లి మీద కత్తి...

వెల్లంపల్లి మీద కత్తి...

విజయవాడ, మే 8, 
వెల్లంపల్లి శ్రీనివాస్ నిజంగా అదృష్టవంతుడు. వైసీపీలో చేరిన వెంటనే ఆయన ఎమ్మెల్యే కావడం, వెనువెంటనే మంత్రి పదవి దక్కడం ఆయన అదృష్టంగానే భావించాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ రెండుసార్లు గెలిచారు. ఒకసారి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలుపొందగా, తిరిగి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు. సామాజికవర్గం కోటాలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది.అయితే వచ్చే మంత్రి వర్గ విస్తరణలో వెల్లంపల్లి శ్రీనివాస్ పదవి ఊడిపోవడం ఖాయమంటున్నారు. ఆయనకు ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కీలమైన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ పై దుర్గగుడి లోజరిగిన అవినీతి ఆరోపణలు పదవిని దూరం చేస్తాయంటున్నారు. అంతేకాదు ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే దేవాలయాల్లో దాడులు, విగ్రహాల ధ్వంసం వంటివి జరగడం కూడా వైసీపీ అధినేత సీిరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక అవినీతి ఒక్కటే వెల్లంపల్లి శ్రీనివాస్ ను మంత్రి పదవి నుంచి తొలగించడానికి ప్రధాన కారణమయ్యే అవకాశం లేదు. కృష్ణా జిల్లాలో సీినియర్ నేతలు ఎంతో మంది ఉన్నారు. తొలి నుంచి జగన్ ను నమ్ముకుని పార్టీ కోసం పనిచేసిన వారున్నారు. వారంతా రెండో విడత మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నారు. కొడాలి నాని, పేర్ని నానితో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కు మంత్రివర్గంలో జగన్ చోటు కల్పించారు.
అయితే ఈసారి ఎక్కువ మంది సీనియర్ నేతలు మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. కొలుసు పార్థసారధి, జోగి రమేష్, సామినేని ఉదయభాను వంటి నేతలు తమకు ఈసారి మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని జగన్ మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. కొడాలి నాని, పేర్ని నాని విషయంలో కొంత జగన్ ఆలోచించినా, వెల్లంపల్లి శ్రీనివాస్ విషయంలో మాత్రం స్పేర్ చేయరంటున్నారు.

Related Posts