అమరావతి మే 8
కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు కోసం తరలిస్తున్న జిలిటెన్‌స్టిక్స్ పేలిన ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలోని బైరటీస్ గనుల వద్ద చోటు చేసుకుంది. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనిలో పేలుడు కోసం తరలించారు. అన్‌లోన్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. పేలుడు ధాటికి మృతదేహాలను తునాతునకలై.. మాంసపు ముద్దలు ఎగిరిపడ్డాయి. దీంతో మృతులను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అలాగే వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు ఘటన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. మృతుల ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం మృతులకు సంతాపం ప్రకటించారు.