YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

1511 పోస్టులకు అనుమతించిన ప్రభుత్వం కలెక్టర్ ఛైర్మన్గా జిల్లాల్లో ఎంపిక కమిటీలు

1511 పోస్టులకు అనుమతించిన ప్రభుత్వం కలెక్టర్ ఛైర్మన్గా జిల్లాల్లో ఎంపిక కమిటీలు

ఆంధ్రప్రదేశ్లో 1511 పంచాయతీ కార్యదర్శుల ఖాళీలను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం (ఏప్రిల్ 27) ఉత్తర్వులు జారీ చేశారు. 13 జిల్లాల్లో 2565 కార్యదర్శుల ఖాళీల్లో 1054 భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీసీఎస్సీ) ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. మిగతా 1511 ఖాళీలను ఒప్పంద విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల కోసం జిల్లా స్థాయి కమిటీకి ఛైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో), జిల్లా పంచాయతీ అధికారి ఉంటారు. అభ్యర్థులు రాష్ట్రానికి చెందిన వారై కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 80 శాతం మెరిట్ (విద్యార్హత), మరో 20 శాతం ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థుల కాంట్రాక్టు కాలం ఏడాదిగా నిర్ణయించారు. పనితీరు సంతృప్తిగా లేనట్లు అధికారులు భావిస్తే ఏడాది కాలంలో ఎప్పుడైనా తొలగిస్తారు. జిల్లాల వారీగా ఖాళీలు శ్రీకాకుళం – 83,  విజయనగరం – 61, విశాఖపట్నం – 94, తూర్పు గోదావరి – 205, పశ్చిమ గోదావరి – 113, కృష్ణా – 196, గుంటూరు – 112, ప్రకాశం – 22, నెల్లూరు – 194, అనంతపురం – 130, కర్నూలు – 111, కడప – 194, చిత్తూరు – 166, మొత్తం - 1511

Related Posts