YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

ఆగస్టు నాటికి వ్యాక్సిన్ పూర్తి

ఆగస్టు నాటికి వ్యాక్సిన్ పూర్తి

లండన్, మే 8
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఏడాదికి పైగా కాలం నుంచి ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని బారిన పడి ఇండియా సహా మరికొన్ని దేశాలు అల్లాడుతుంటే మరికొన్ని దేశాలు మెల్లిగా కోలుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు నాటికి తమ దేశంలో కరోనా వైరస్ అంతమైపోతుందనిబ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2022 ప్రథమార్ధంలో వ్యాక్సిన్ బూస్టర్ ప్రోగ్రాంను బ్రిటన్‌ ప్రభుత్వం చేపట్టబోతోందని తెలిపారు.కరోనాను ఎదుర్కోవడం‍లో అందరి శరీరాల్లో యాంటీబాడీలు ఒకేలా పని చేయవు, అలాంటి వారి కోసం బూస్టర్ షాట్ అనే కార్యక్రమాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు క్లైవ్ డిక్స్ తెలిపారు. అలాగే జూలై చివరిలోగా బ్రిటన్‌ ప్రజలకు కనీసం ఒక్క డోసు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్‌లో టాస్క్‌ఫోర్స్‌కు తాత్కాలిక నాయకుడిగా నియమితులైన డిక్స్ గత వారం తన పదవి నుంచి వైదొలిగారు.బ్రిటన్‌లో ఇప్పటివరకు 5 కోట్ల మందికి పైగా టీకాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సగం మంది వయోజనులకు మొదటి డోసు ఇచ్చిన రెండో దేశంగా బ్రిటన్ రికార్డు సృష్టించింది. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నందున 40 ఏళ్లలోపు వారికి ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ప్రత్యామ్నాయ వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫైజర్, మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ల వైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు.

Related Posts