YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

వ్యాక్సిన్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీ విధించ‌డం పై రాజ‌స్ధాన్ మంత్రి విమ‌ర్శ‌లు

వ్యాక్సిన్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీ విధించ‌డం పై రాజ‌స్ధాన్ మంత్రి విమ‌ర్శ‌లు

జైపూర్ మే 9
కొవిడ్-19 వ్యాక్సిన్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీ విధించ‌డం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం పెట్రో ధ‌ర‌ల పెంపుపై మోదీ స‌ర్కార్ ల‌క్ష్యంగా కాంగ్రెస్ నేత‌, రాజ‌స్ధాన్ మంత్రి ప్ర‌తాప్ ఖ‌చ‌రియ‌వ‌స్ విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో పౌరులంద‌రికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఉచిత వ్యాక్సిన్ పొంద‌డం పౌరుల హ‌క్క‌ని..దీనిపై ఎలాంటి చ‌ర్చ లేకుండా స‌త్వ‌ర‌మే పౌరులంద‌రికీ ఉచిత వ్యాక్సినేష‌న్ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.కొవిడ్ వ్యాక్సిన్ల‌పై ప‌న్నుల భారంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌నంగా రూ 3000 కోట్లు వెచ్చించాల్సి ఉంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు ఆక్సిజన్ కొర‌త‌తో ప్రాణాలు విడుస్తుంటే కేంద్ర ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను త‌న గుప్పిట్లోకి తీసుకుంద‌ని విమ‌ర్శించారు. ఆక్సిజ‌న్ నిర్వ‌హ‌ణ మీకు చేత‌కాకుంటే రాష్ట్రాల‌కు విడిచిపెట్టాల‌ని మంత్రి కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు.

Related Posts