YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆక్సిజ‌న్ పంపిణీని కి 12 మంది స‌భ్యుల‌తో నేష‌న‌ల్ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు సుప్రీంకోర్టు

ఆక్సిజ‌న్ పంపిణీని కి 12 మంది స‌భ్యుల‌తో నేష‌న‌ల్ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు  సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ మే 9
 దేశవ్యాప్తంగా మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, పంపిణీని ప‌ర్య‌వేక్షించ‌డానికి 12 మంది స‌భ్యుల‌తో నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు శాస్త్రీయంగా, హేతుబ‌ద్ధంగా, స‌మానంగా ఆక్సిజ‌న్ అందేలా చూడ‌టం ఈ టాస్క్‌ఫోర్స్ బాధ‌త్య‌. కొవిడ్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మందుల విష‌యంలోనూ ఈ టాస్‌్‌ఫోర్స్ అదే ప‌ని చేయ‌నుంది. వివిధ రాష్ట్రాల‌కు కేంద్రం చేస్తున్న ఆక్సిజ‌న్ కేటాయింపుల‌ను పునఃస‌మీక్షించాల‌ని చెబుతూ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.అంబులెన్సులు, కొవిడ్ కేర్ స‌దుపాయాలు త‌గిన‌న్ని లేక‌పోవ‌డం, హోమ్ క్వారంటైన్‌లో ఉన్న పేషెంట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు వెస్ట్ బెంగాల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వీసీ డాక్ట‌ర్ భ‌బ‌తోష్ బిశ్వాస్ నేతృత్వం వ‌హించ‌నున్నారు.

Related Posts