YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో కరోనా నిర్మూలనకు ఉచిత కషాయం పంపిణీ

ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో  కరోనా నిర్మూలనకు ఉచిత కషాయం పంపిణీ

నెల్లూరు
కరోనా వైరస్ తో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు, ప్రేవేట్,ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆక్సిజన్  అందక,సరిఅయిన చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చూస్తున్నాం, భారతీయ సంస్కృతిలో ఆయుర్వేదం కు ఎంతో శక్తి,విశిష్టత ఉంది అవి భారతీయులు వినియోగించులేక పోవడంతో ఇతర దేశాల్లో భారతీయ ఆయుర్వేదం ను  వాడుతున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ ను కూడా ఆయుర్వేదం తో కట్టడి చేయవచ్చు అని ఆయుర్వేద వైద్యులు  వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్)ఆధ్వర్యంలో ఆయుర్వేద మూలికలతో కషాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.శనివారం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్)ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద కరోనా నిర్మూలన కు ఉచిత కషాయం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో గూడూరు ఆపద్బాంధవుడు సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోటా సునీల్ కుమార్ స్వామి ముఖ్య అథిగా పాల్గున్ని ఆయన చేతుల మీదుగా ప్రజలకు కషాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేశంలో ఏ విపత్తు వచ్చినా ఆర్ ఎస్ ఎస్  ముందుండి సహాయం చేస్తుందని, అందులో భాగంగా కరోనా నిర్మూలనకు ఈకషాయంచాలాఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.ఈ కషాయం లో ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి  వస్తువులతో తయారు చేయడం జరిగిందని దీనివల్ల కరోనా నిర్మూలనకు ఈ కషాయం చాలా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు, తమ తమ ఇంట్లో కూడా ఈ కషాయం తయారు చేసుకోవచ్చని తెలిపారు.అనంతరం ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలక్ సేగు ప్రసాద్  మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఆర్ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ప్రతి కేంద్రంలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ప్రతీ రోజు గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉదయం 6:30 నుండి 8:00వరకుజరుగుతుందనితెలిపారు. అందుబాటులో ఉన్నప్రజలు ఈకషాయంను ఉపయోగించుకోవాలి అని ఆయన కోరారు.,ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు ప్రసాద్ రెడ్డి , విగ్నేష్ సురేంద్ర , మల్లికార్జున, ఆర్ ఆర్ ఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts