YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేన వైపు జ్యోతుల చూపు

జనసేన వైపు జ్యోతుల చూపు

కాకినాడ, మే 10, 
లుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. భవిష్యత్ అనేది కనుచూపు మేరలో కన్పించడం లేదు. అయితే టీడీపీ నేతలకు ఉన్న ఆశ ఒక్కటే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ముందుకెళతాయని. అది జరిగితేనే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనేక మంది నేతలు భావిస్తున్నారు. ఇక టీడీపీ లో ఉన్న నేతలు జనసేన వైపు కూడా చూస్తున్నారు. ప్రధానంగా కాపు సమాజికవర్గం అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా విన్పిస్తున్న పేరు జ్యోతుల నెహ్రూ. జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఇటీవల పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. తాము బరిలోకి దిగుతామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా టీడీపీ ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. తాను పార్టీని వీడటం లేదని జ్యోతుల నెహ్రూ చెప్పినప్పటికీ, ఆయన జనసేన వైపు చూస్తున్నారన్న టాక్ ఉంది.తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. కాపు సామాజికవర్గం అండతో ఆయన గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ నుంచి 1994, 1999 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ గెలిచారు. ఆ తర్వాత 2004, 2009లో ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడి నుంచి తిరిగి వైసీపీలో చేరి 2014లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన తన కుమారుడి భవిష్యత్ కోసం తిరిగి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే టీడీపీలో ఉంటే సాధ్యం కాదని జ్యోతుల నెహ్రూ భావిస్తున్నారు. అందుకే జనసేనలో చేరి తాను కాని, తన కుమారుడు కాని వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. జనసేనలో చేరితే ఇటు సామాజికవర్గం ఓట్లతో పాటు టీడీపీ పొత్తు ఉంటుంది కనుక విజయం ఖాయమని జ్యోతుల నెహ్రూ నమ్ముతున్నారు. మరి జ్యోతుల నెహ్రూ జనసేనలో ఎప్పుడు చేరతారన్నది చూడాల్సి ఉంది.

Related Posts