YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యోగికి వరుస దెబ్బలు

యోగికి వరుస దెబ్బలు

లక్నో, మే 10, 
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఎంతో దూరం లేవు. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి విజయం సాధించాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈసారి యూపీలో బీజేపీకి కష్టాలు తప్పేట్లు లేవు. ఈ రకమైన సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి. యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా బీజేపీ విజయానికి ఆటంకంగా మారనున్నాయి.425 పార్లమెంటు నియోజకవర్గాలున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. గత ఎన్నికల్లో మూడు వందలకు పైగా స్థానాలను సాధించిన బీజేపీకి ఈసారి అందులో సగం వచ్చినా వచ్చినట్లేనంటున్నారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత కనపడుతుందంటున్నారు. పైగా ఇక్కడ కులాలు విజయాన్ని సాధిస్తాయి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాధ్ కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించడం సవాల్ గా మారనుంది.మొన్నటి మొన్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో బీజేపీకి దక్కింది కేవలం నాలుగు స్థానాలు మాత్రమే. దీంతో క్రమంగా బీజేపీ పట్టు కోల్పోతుందనే అనుకోవాలి. ఇది వచ్చే ఎన్నికలకు సంకేతంగా భావిస్తున్నారు. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ ఎన్నికలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టింది. కాంగ్రెస్ తరుపున ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు.ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమి పాలయింది. దీంతో మోదీ హవా కూడా తగ్గుతుందంటున్నారు. వ్యతిరేకత ఇప్పుడిప్పుడే ప్రారంభమయిందని అసెంబ్లీ ఎన్నికల నాటికి అది మరింత ఎక్కువవుతుందన్నది విపక్షాల అభిప్రాయం. మొత్తం మీద చూసుకుంటే ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఈసారి గెలవడం అంత సులువు కాదన్నది అందరి అభిప్రాయం.

Related Posts