YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పద్మ విభూషన్ రఘునాథ్ మాహాపాత్ర మరణం భారత శిల్ప కళారంగానికే తీరని లోటు...

పద్మ విభూషన్ రఘునాథ్ మాహాపాత్ర మరణం భారత శిల్ప కళారంగానికే తీరని లోటు...

ఒడిస్సా కు చెందిన ప్రఖ్యాత శిల్పి పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషన్ బిరుదాంకితులు రాజ్యసభ సభ్యులు శ్రీ రఘునాథ్ మహాపాత్ర తుదిశ్వాస విడిచారు. గత నెల 22న కోవిడ్ పరీక్షల్లో  పాజిటీవ్ తేలడంతో ఆయన్ను భువనేశ్వర్ లోని ఏ ఐ ఐ ఎమ్స్ లో చేర్పించారు. అన్నిరకాలు వైద్య సేవలు అందించిన చివరకు  తుది శ్వాస విడిచినట్లు ఆయనకు వైద్య సేవలు చేస్తున్న డాక్టర్లు ధ్రువీకరించారు. 78 ఏళ్ల ఈ మాహా శిల్పి గత ఆరు దశాబ్దాలుగా ఎన్నో వందల దేవాలయాల నిర్మాణాలకు రూపకర్త. ఆంద్రప్రదేశ్ లో ఆయన చేపట్టిన మొట్టమొదటి దేవాలయ నిర్మాణం  భీముని పట్నంలో సద్గురు శ్రీ శివానంద మూర్తిగారి ఆనందవనంలోని శ్రీ మహాలక్ష్మీ దేవాలయం. ఇది ఎంతో వైభవంగా అద్భుతంగా ఎంతో రమణీయంగా సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి సూచనలతో  మాహాపాత్ర గారి శిల్పాకౌసలంతో నిర్మించబడింది.  వారి మృతి పట్ల సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్  మెనేజింగ్ ట్రస్టీ రాజ్ కందుకూరి వాటి అనుబంధ సంస్ధల సభ్యులు సంతాపాన్ని తెలియచేశారు.
ప్రపంచంలోనే  భారత దేశ  దేవాలయ నిర్మాణ సంస్కృతికి, శిల్పకళా నైపుణ్యానికి  ఎంతో  ప్రాధాన్యత ఉందనీ, ఆ శిల్ప సౌందర్య కళా విద్యకు రఘునాథ్ మాహాపాత్ర గారి సేవలు అసమాన్యం అని ట్రస్ట్ సభ్యులు తెలియచేశారు. మాహాపాత్ర మృతి పట్ల ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదిరర్లు వారి సంతాపాన్ని తెలియచేశారు. వంశపారంపర్యంగా సంక్రమించిన ఈ శిల్ప కళా విద్యపైనే ఎంతో మక్కువ కనబర్చిన రఘునాథ్ మాహాపాత్ర ప్రాధమిక విద్యతోనే ఆపేశారు.చిన్నతనం నుండి ప్రాచీన  శిల్ప కళ ల పట్ల ఎంతో ఆశక్తి తో తనలోని సృజనాత్మతకు పదునుపెట్టారు. రాతి నిర్మాణాలపై జీవకళ ఉట్టిపడేలా శిల్ప సౌందర్యాన్ని తీర్చి దిద్దారు.కోణార్క సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ్ మందిరం వీరి పూర్వీకులు చేపట్టినదే...దాన్ని మరింత కళాత్మకంగా నిర్మించాలని పూరీ భువనేశ్వర్ జాతీయ రహదారి ప్రక్కన లో వంద ఎకరాల సువిశాల మైదానంలో రెండవ సూర్య దేవాలయాన్ని ఆదిత్య నారాయణ మందిరం వారి డ్రీమ్ ప్రాజెక్ట్  గా 2017లో చేపట్టారు. వారి శిల్ప కళా సృష్టి కి కేంద్రప్రభుత్వం 1976 లో పద్మశ్రీ, 2001 లో పద్మభూషణ్, 2012 లో పద్మ విభూషణ్ పురస్కారాల తో గౌరవించింది.2018 లో వారు రాజ్యసభ సభ్యులు గా నియమితులయ్యారు. 
జీవ కళ ఉట్టిపడేలా బుద్ధుడి విగ్రహాన్ని  జపాన్, పారిస్ లో నిర్మించారు.  బూడిద వర్ణంలో ఉండే  ఆరడుగుల  సూర్యుడు  రాతి విగ్రహాన్ని ఎంతో రమణీయంగాపార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఒడిస్సా ప్రభుత్వం రఘునాథ్ మహాపాత్రను ఆర్ట్ అండ్ హస్తకళా శాఖలో ఉన్నత పదవులిచ్చి గౌరవించింది..అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ శాఖ లో కోడా పలు పదవులు చేపట్టారు. శిల్ప కళను  వృత్తి  విద్యగా వేలమంది విద్యార్థులు వీరి వద్ద శిష్యరికం చేస్తున్నారు. వీరి మృతి శిల్ప కళా రంగానికే తీరని లోటు.
సురేష్ కశ్యప్
ఎస్.కె.న్యూస్

Related Posts