హైదరాబాద్, మే 10,
లాయర్ వామన్‌రావు దంపతుల హత్యకేసులోపుట్టా మధు చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. న్యాయవాద దంపతులు వామన రావు హత్యకు సంబంధించి పోలీసులు సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. పుట్ట మధుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 12 బ్యాంక్ లకు లేఖలు రాసారు. పుట్టా మధు, పుట్ట శైలజ , పుట్టా మధు కొడుకు, కోడలు, కూతురు అకౌంట్స్ వివరాలు ఇవ్వాలని లేఖ రాసారు. పుట్ట సతీష్ , రాయచూర్ శ్రీనివాస్, కుంట శ్రీను, బిట్టు శ్రీనివాస్ , పూదరి సత్యనారాయణ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ లకు పోలీసుల నోటీసులు ఇచ్చారు.వామన్ రావ్ హత్యకు రెండు నెలల ముందు, రెండు నెలల ట్రాన్సాక్షన్స్ వివరాలు కోరుతూ పోలీసుల లేఖ రాసారు. 5 లక్షలకు మించి లావాదేవీల వివరాలు ఇవ్వాలని పోలీసుల లేఖలో పేర్కొన్నారు. రెండు కోట్ల వ్యహారం తేల్చేవరకు కొనసాగనున్న విచారణలో మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.రెండ్రోజులుగా పుట్టాను పోలీసులు ప్రశ్నిస్తుండగా.. తాజాగా ఆయన భార్య శైలజను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక, ఈ కేసులో కమలాపూర్ సత్యనారాయణను కూడా విచారణ జరుపుతున్నారు. పుట్టా శైలజ, సత్యనారాయణ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో రూ.2 కోట్ల వ్యవహారమే కీలకమని పోలీసులు భావిస్తున్నారు.వామనరావు దంపతుల హత్య జరగడానికి ముందు బ్యాంకు నుంచి ఉప సంహరించిన రూ.2 కోట్లు ఎవరెవరి చేతులు మారాయనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో 12 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఆయా బ్యాంకుల నుంచి పోలీసులు ఈ 12 మంది అకౌంట్లకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ వ్యవహారంలో రాయచూర్, ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యాపారుల అకౌంట్లపై కూడా పోలీసులు కన్నేశారు.బిట్టు శ్రీను, కుంటా శ్రీను, సతీష్‌తోపాటు కొంతమంది రాజకీయ నాయకుల అకౌంట్లపై కూడా దృష్టి పెట్టారు. కుంటా శ్రీను నిర్మిస్తున్న ఇంటికి పుట్టా మధు ఆర్థిక సాయం చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, విచారణలో భాగంగా పుట్టా మధు నోరు మెదపడం లేదని సమాచారం. వామన్ రావు దంపతుల హత్య జరిగిన సమయంలో కుంట శ్రీను, పుట్ట మధులు కలిశారా.. లేదా అనే విషయంపై కూడా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.