సూర్యాపేట
తెలంగాణ, ఏపీ రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వద్ద.. ఏపీ నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లను తెలంగాణ పోలీసులు ఆపి వేస్తున్నారు. తెలంగాణలోని ఆసుపత్రులలో అనుమతులు పొందిన వారికి మాత్రమే అనుమతులు ఇస్తామంటున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. కోదాడ మండలం. రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఏపీ కొవిడ్ రోగులకు తెలంగాణలోకి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. తెలంగాణ హాస్పిటల్స్ లో బెడ్స్ ఇతర రాష్ట్రాల వారితో నిండి ఉండడంతో స్థానికులకు బెడ్స్ దొరకడం లేదని విమర్శలు వస్తున్న నేపధ్యంలోప్రభుత్వం చర్యలు చేపట్టింది.