అనంతపురం
కరోనా నేపథ్యంలో కొత్తగా వ్యాక్సినేష న్ ప్లాన్ ను 31వ తేదీ వరకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఈనెల 11తేదీ మంగళవారం నుంచి జిల్లాలో సెకండ్ డోస్ వ్యాక్సినే షన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ అంశం పై డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్ తో కలిసి జాయింట్ కలెక్టర్ ఏ.సిరి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మే 31వ తేదీ వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వేయబడదన్నారు. కొత్తగా వ్యాక్సినేషన్ ప్లాన్ లో భాగంగా 11వ తేదీ మంగళవారం నుంచి జిల్లాలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. జూన్ 1వ తేదీనుంచి ఫస్ట్ డోస్ కావాలంటే స్లాట్ బుక్ చేసుకుని ఆన్లైన్ లో ఫ్రీ రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ పోర్టల్ లో లాగిన్ అయి ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఏ తేదీ, టైం, ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. కోవిన్ పోర్టల్ లో ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని, ఇందులో లబ్ధిదారుల పేరు, ఫోన్ నెంబరు, వివరాలు వస్తాయని, వాటిని ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు ఇవ్వడం, ఎన్ ఐసి ద్వారా బల్క్ ఎస్ ఎం ఎస్ లు ఇవ్వడం జరుగుతుందన్నారు. సెకండ్ డోస్ వేయించుకునే వారికి ఒక మెసేజ్ వస్తుందని, ఎక్కడికి వెళ్లాలి, ఏ సమయానికి వెళ్లాలి అనేది మెసేజ్ వస్తుందని, వారికి కాల్ చేసి చెబుతామని, మెసేజ్ కూడా వస్తుందన్నారు.