YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా కట్టడిలో మాటలు తప్ప చేతలు శూన్యం.. ఎల్.హెచ్.పి.ఎస్.రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్

కరోనా కట్టడిలో మాటలు తప్ప చేతలు శూన్యం..  ఎల్.హెచ్.పి.ఎస్.రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్

ఖమ్మం మే 10
కరోనా కట్టడి అంశంలో కేంద్ర ,  రాష్ట్ర ప్రభుత్వాల మాటలు తప్ప చేతలు శూన్యమని , అందుకే నేడు వందలు వేలు దాటి లక్షల సంఖ్యలో ప్రజలు మృతి చెందుతున్నారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్  ఒక ప్రకటనలో తీవ్రంగా ఆరోపించారు . ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ముందస్తు ఆలోచనతో ప్రణాళిక రూపొందించుకొని దానికనుగుణంగా సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు . గత సంవత్సరం జనవరిలో మనదేశంలో కరోనా కేసు బయటపడగా తక్షణమే దానిపై కార్యాచరణ ప్రకటించకుండా ఆ నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఆహ్వానించిన ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రంలో లక్షలాది మంది తో భారీ బహిరంగ సభను తలపెట్టి పెద్ద పొరపాటు చేశారని , ఆ తర్వాత  రెండు నెలల అనంతరం మార్చి 24న ఎక్కువ సమయం కేటాయించకుండా ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా లాక్ డౌన్ విధించారని గుర్తు చేశారు . ఆ సమయంలో భారతదేశం వ్యాప్తంగా కరోనా కేసులు వందలలో ఉంటే మరణాలు కేవలం తొమ్మిది మాత్రమే ఉన్నాయని తెలిపారు . కరోనా రెండవ దశ గురించి ముందస్తు హెచ్చరికలు , ఉన్నప్పటికీ అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అని తెలిసినప్పటికీ , విస్మరించి , నిర్లక్ష్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించడమే కాకుండా అనేక ర్యాలీలు తలపెట్టడం ,   లక్షలాది మంది గుమ్మి కూడే మతపర కార్యక్రమo కుంభమేళ కు అనుమతులు ఇవ్వడం ఆత్మహత్యా సదృశ్య మైన విషయమని దుయ్యబట్టారు . పాలకుల నిర్లక్ష్యం , నిర్లిప్తత , బాధ్యతా రాహిత్యంను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాల్లోని హైకోర్టులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని చెప్పారు . రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నా , అదే స్థాయిలో లక్షలాదిమంది ఆక్సిజన్ లు , బెడ్లు అందకుండా మరణిస్తున్నా  ప్రధాని మోడీ గాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గాని దీనిపై ఒక ప్రణాళికను సిద్ధం చేయకపోవడం అత్యంత విచారకరమన్నారు . గత ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా విషయంలో పలు హెచ్చరికలు జారీచేసిన మనం వాటిని పరిగణలోకి తీసుకోకపోవటం క్షమార్హం కానీ అంశమన్నారు . 45 సంవత్సరాల పైబడి వయసు గల వారికి ఇంకా రెండవ డోసు లోనే ఉన్న ఆ సమయంలో మే1 నుండి 18 సంవత్సరాల వయసు వారికి కూడా వ్యాక్సిన్లను ఇస్తున్నామని , అంతలోనే వెనుదిరగడం మనకు గల ముందు చూపు ఎంత ఉన్నదో , మన వైఖరి , మన చిత్తశుద్ధి ఏమిటో తెలియజేస్తుంది అన్నారు . అనేక అభివృద్ధి చెందిన దేశాలలో టీకా కార్యక్రమం అత్యంత వేగవంతంగా కొనసాగుతూ ఇప్పటికీ సుమారుగా పాతిక శాతం చేరుకున్నది . ఈ సమయంలోనే మనం ఇంకా రెండు శాతం కూడా దాటలేదని వార్తలు రావటం బాధాకరంగా ఉందన్నారు . ప్రజల జీవితాలతో ఆటలాడకుండ  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా చిత్తశుద్ధితో కరోనా వ్యాక్సిన్ ల విషయంలో గాని , ఆక్సిజన్ ల విషయంలో గాని  ఆస్పత్రుల బెడ్లకు సంబంధించిన విషయంలో గాని అవాస్తవాలు చెప్పకుండా , పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు . కరోనా కారణంగా చనిపోతున్న అనేక మందిని చూసి మద్రాసు హైకోర్టు చెప్పినట్టు , ఎన్నికల సంఘందే ప్రధాన బాధ్యత , ఆ ఎన్నికల సంఘం పై మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయకూడదని ప్రశ్నించిన క్రమంలో మన పాలకుల విధానాన్ని కూడా తీవ్రంగా తూర్పార పట్టాల్సిన అవసరం ఉందని , ఆయా ప్రభుత్వాలపై కూడా అ మర్డర్ కేసులను నమోదు చేయాలని న్యాయస్థానాలు ఆదేశిస్తే బావుంటుందని బానోతు బద్రు నాయక్ పేర్కొన్నారు . ఇదిలా ఉండగా , అప్పుడే కొంతమంది కరోనా మూడో దశ గురించి వివరిస్తూ , వల్లకాడుగా మారుస్తుందని చేస్తున్న హెచ్చరికలు పాలకుల చెవిన పడటం లేదని ఇక న్యాయ స్థానాలులే క్రియాశీలక పాత్రను పోషించాలని కోరారు.

Related Posts