YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కరోనా సెకండ్ వేవ్ పై మంత్రి పేర్ని నాని సమీక్ష

కరోనా సెకండ్ వేవ్ పై మంత్రి పేర్ని నాని సమీక్ష

విజయవాడ
రాష్ట్రంలో వేగంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోందని, జన్యు మార్పుల ప్రభావం వల్ల వైరస్ సంక్రమణ లక్షణాలు పెరగడంతో వైరస్ తీవ్రత మరింత పెరిగిపోతోందని రాష్ట్ర రవాణా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.విజయవాడలో వైద్యాధికారు లతో సమావేశమై కోవిడ్ పరిస్థితిపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇన్ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు ఒకవేళ దగ్గు వస్తే.. అది సాధారణ దగ్గుని పోలి ఉండదని దానికి భిన్నంగా దగ్గు నిరంతరం వస్తూనే ఉంటుందని అలాగే సంబంధిత వ్యక్తి స్వరంలో కూడా మార్పు గమనిస్తున్నామని తెలిపారు. కరోనా అంటే ఏ ఆరోగ్య సమస్యలు లేనివారే మన ప్రాంతంలో భయపడుతున్నారని ఇక ఆస్తమా, శ్వాస సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలుంటే వారి మానసిక పరిస్థితి చెప్పనవసరం లేదన్నారు.కానీ అలాంటి వారు సైతం ఆత్మవిశ్వాసంతో ఉక్కు సంకల్పంతో పోరాడి గెలుస్తున్నారు. పూర్తిగా కోలుకుంటున్నారనే విషయం మరువరాదని మంత్రి పేర్ని నాని అన్నారు.కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి అన్నారు . ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించడంతోపాటు మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్కులు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ చెబుతూ, ఎంతో ముఖ్యమైన పనులుంటే తప్ప ఇండ్ల నుంచి బయటికి వెళ్లడం మానుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి కాదు ఘోషిస్తున్నాయని ఆయన అన్నారు. అనవసర ప్రయాణాలు, శుభ కార్యాలు వాయిదా వేసుకోవాలని ప్రజలను ఈ సాదరంగా వేడుకొంటున్నట్లు  స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అవుతుందని అందరూ జ్ఞాపకం చేసుకోవాలని మంత్రి పేర్ని నాని అన్నారు.
అనంతరం డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా తానూ అధ్యాయనం చేసిన సంగతులు వివరించారు. పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయని,  వయోబేధం లేకుండా చిన్నా పెద్దవారికి కోవిడ్ సోకడం గమనించానని ఇటీవల తానూ 13 సంవత్సరాల పిల్లవానికి కోవిడ్ చికిత్స చేశానని  మంత్రికి తెలిపారు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్న , మధుమేహం, రక్తపోటు , గుండె , కిడ్నీ, ఆస్మా సంబంధిత రోగులకు ఈ వైరస్ పెనుముప్పుగా పరిణమించనుందని చెప్పారు.

Related Posts