YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విదేశీయం

అమెరికాలో కాల్పులు కలకలం.. ఏడుగురు మృతి

అమెరికాలో కాల్పులు కలకలం.. ఏడుగురు మృతి

వాషింగ్టన్‌ మే 10
అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు వేర్వేరు ఘటనల్లో 12 మంది మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి కొలరాడో మొబైల్‌ హోమ్‌ పార్క్‌లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులు జరుపడంతో ఏడుగురు మృతి చెందారు. ఆ తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో ఒకరిది పుట్టిన రోజు వేడుక అని తెలిపారు. అయితే కాల్పులకు గల కారణాలేమిటో తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఉడ్‌ల్యాండ్‌లో పొరుగువారిపై పొరుగింటి వారిపై ఓ వ్యక్తి కాల్పులు జరుపడంతో ముగ్గురు మృతి చెందారు. నిందితుడిపై పోలీసులు ఎదురుకాల్పులు చేయగా.. దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు.

Related Posts