హైదరాబాద్ మే 10
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో తాత్కాలిక నియామకాలకు దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ వెలువడింది. కరోనా తీవ్రత దృష్ట్యా తాత్కాలికంగా 50 వేల మంది వైద్యులు, సిబ్బందిని నియమించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అర్హులైన వైద్యులు, సిబ్బందికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు ఈ నెల 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ. లక్ష వేతనం. ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ. 40 వేల వేతనం. ఆయుష్ మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ. 36 వేలు వేతనం.రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు.ఇందుకు సంబంధించి ఆసక్తి వున్నవాల్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.